TDP Office: రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై నాడు మూకుమ్మడిగా దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో టీడీపీ కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడిలో కీలక సమాచారం సేకరించాం అని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. మాజీ ఎంపీ నందిగం సురేష్, కస్టడీలో పోలీసులకు సహకరించారు. కొన్ని కీలక సమాచారాలు ఇచ్చారని ఆయన ఈ సందర్బంగా తెలిపారు. నేరానికి కుట్ర ఎక్కడ జరిగిందో, చాలా స్పష్టంగా చెప్పారు. వాటి ఆధారంగా ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తాం. మళ్లీ నందిగం సురేష్ ను పోలీస్ కస్టడీకి అడగాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేసారు.
Atishi: కేజ్రీవాల్‌ని మళ్లీ సీఎం చేయడమే మా లక్ష్యం.. సీఎంగా ఎన్నికైన అతిషీ తొలి కామెంట్స్..
సుప్రీంకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తో ఉన్న , వైసీపీ నాయకులను మళ్లీ విచారణకు పిలిచే అవకాశం ఉంది. టీడీపీ కేంద్ర కార్యాలయం పై దాడి తో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనలు జరిగిన సందర్భంలో, ఉన్న పోలీస్ అధికారులు, ఎందుకు ఈ ఘటనను సీరియస్ గా తీసుకోలేదు కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.