దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కార్యాలయంపై దాడి జరిగినట్లు వార్తలు వచ్చాయి. సమాచారం మేరకు దక్షిణ కొరియా పోలీసులు ఆయన కార్యాలయంపై దాడి చేశారు. అంతకుముందు డిసెంబర్ 9న దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించారు. ఆయనపై దర్యాప్తు ప్రారంభించినందుకు గానూ అధ్యక్షుడు దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. అనూహ్యంగా ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ విధించి గందరగోళాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. మార్షల్ లా విధించడం ద్వారా ఆయన ఒక వారంలోపే దేశాన్ని గందరగోళంలోకి నెట్టాడని మంత్రిత్వ శాఖ పేర్కొంది. యూన్‌ను అధికారం నుంచి తప్పించేందుకు ప్రతిపక్షం మరోసారి ఆయనపై పార్లమెంటులో అభిశంసన తీర్మానం తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. పదవిలో ఉండగానే.. దేశం విడిచి వెళ్లకుండా నిషేధం ఎదుర్కొన్న మొదటి దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ అని న్యాయ మంత్రిత్వ శాఖ ఇటీవల ధృవీకరించింది.
READ MORE: Govt Hospital: స్కానింగ్ మాఫియాతో చేతులు కలిపి.. సీల్డ్ కవర్లో డబ్బులు దండుకుంటున్న డాక్టర్లు!
కాగా.. యున్ హఠాత్తుగా డిసెంబర్ 3 రాత్రి మార్షల్ లా ప్రకటించారు. ప్రత్యేక బలగాలను, హెలికాప్టర్లను పార్లమెంటుకు పంపారు. విపక్షాలతో పాటు సొంత పార్టీ ఎంపీలు ఆయన ఆదేశాలను తిరస్కరించి, తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. అయినప్పటికీ, ఆయన పార్లమెంటులో అభిశంసన తీర్మానం నుంచి తృటిలో తప్పించుకున్నారు. అధ్యక్షుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సియోల్ అంతటా నిరసనలకు దారితీసింది. అధికారం నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ వెలుపల భారీ సంఖ్యలో ప్రజలు నిరసన తెలిపారు.
మార్షల్ లా రాజకీయ అశాంతికి కారణమైంది