NTV Telugu Site icon

Michaeng Effect: మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీ మీదుగా వెళ్లే 144 రైళ్లు రద్దు

South Railway

South Railway

దక్షిణ మధ్య రైల్వే.. ప్రయాణికులకు హెచ్చరిక జారీ చేసింది. ఏపీ వైపు మిచౌంగ్ తుఫాన్ దూసుకువస్తున్నందున్న భారీ రైళ్లరు రద్దు చేస్తున్నట్టు తాజాగా ప్రకటన ఇచ్చింది మొత్తం 144 రైళ్లను రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. డిసెంబర్ 2 నుంచి 6 వరకు ఏపీ మీదులగా వెళ్లే 144 రైళ్లను రద్దు చేసింది. అందులో సికింద్రాబాద్, విజయవాడ , విశాఖపట్నం, తిరుపతి నుంచి వెళ్లే రైళ్లు కూడా ఉన్నాయి. కావునా ప్రయాణికులు తమ సహకరించాలని, ఇప్పటికే ఈ రైళ్లల్లో టికెట్స్ బుక్ చేసుకున్నట్టైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి రైల్వే అధికారులు కోరారు. ఈ సందర్భంగా రద్దైన రైళ్ల వివరాలను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది దక్షిణ మధ్య రైల్వే.

విజయవాడ-చెన్నై, సికింద్రాబాద్-గూడూర్, లింగంపల్లి-తిరుపతి, సికింద్రాబాద్-తిరుపతి, కాకినాడ-బెంగళూరు రైళ్లతో సహా 144 రైళ్లు రద్దు కావడం విశేషం. కాగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్ప పీడ‌నం శుక్రవారం వాయుగుండంగా మారి.. ఆదివారానికి తుఫానుగా బ‌ల ప‌డ‌నుందని వాతావరణ శాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ తుఫాన్‌కు మిచౌంగ్ అని భార‌త వాతావ‌ర‌ణ విభాగం పేర్కొంది. దీంతో ఆది, సోమ‌ వారాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు, కొన్ని ప్రాంతాల్లో తేలిక‌పాటి జ‌ల్లుల నుంచి మోస్తరు వ‌ర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.