NTV Telugu Site icon

ODI WC 2023: శ్రీలంక అవుట్, అయోమయంలో వెస్టిండీస్ .. వరల్డ్ కప్ రేసులో సౌతాఫ్రికా..

South Africa

South Africa

ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ సూపర్ లీగ్ లో భాగంగా సౌతాఫ్రికా మరో ముందడుగు వేసింది. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుత విజయం సాధించి.. వెస్టిండీస్ టీమ్ కు నిద్దపట్టకుండా చేసింది. మరొక్క గెలుపు సాధిస్తూ చాలు ప్రపంచకప్ రేసులో ప్రొటిస్ జట్టు ముందుకు వెళ్తుంది. కాగా బెనొని వేదికగా నెదర్లాండ్స్ తో జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో గెలిచింది.
టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న పర్యాటక ప్రొటిస్ కు సిసంద మగల శుభారంభం అందించాడు.

Also Read : Mahesh Babu: #SSMB28 షూటింగ్ బ్రేక్… సంక్రాంతి వరకూ టైం ఉంది కదా…

డచ్ ఓపెనర్లు విక్రమ్ సింగ్(45), మాక్స్ ఒడౌడ్( 18)లను అవుట్ చేసిన మగల.. తేజ నిడమనూర్( 48) రూపంలో మరో కీలక వికెట్ పడగొట్టాడు. మిగతా బౌలర్లలో మార్కో జాన్సన్ ఒకటి, నోర్జ్టే రెండు, షంసీ మూడు, మార్కరమ్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో 46.1 ఓవర్లలో నెదర్లాండ్స్ 189 పరుగులు చేసి ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా 30 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. కెప్టెన్ తెంబా బవుమా 90 పరుగులతో అజేయంగా నిలివగా.. ఎయిడెన్ మార్కరమ్ 51 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టును గెలిపించారు.ఇక ఈ గెలుపుతో పది పాయింట్లు సాధించిన సౌతాఫ్రికా.. సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో శ్రీలంకను వెనక్కినెట్టి తొమ్మిదో స్థానానికి దూసుకొచ్చింది.

Also Read : Ashok Gehlot : ఖలిస్తాన్‌పై అమృతపాల్‌ ధైర్యం అదే.. కారణం చెప్పిన రాజస్థాన్ సీఎం

నెదర్లాండ్స్ తో మిగిలి ఉన్న ఆఖరి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు గెలిస్తే వెస్టిండీస్ ను వెనక్కి నెట్టి ఎనిమిదో స్థానానికి ఎగబాకుతుంది. తద్వారా ప్రపంచకప్ 2023 టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తుంది. అయితే మూడు వన్డేలో గెలవడంతో పాటు.. బంగ్లాదేశ్-ఐర్లాండ్ మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఫలితం తేలిన తర్వాతే సౌతాఫ్రికాకు బెర్తు ఖరారు అవుతుందో.. లేదోనన్న విషయంపై క్లారిటీ వస్తుంది.
ఒక వేళ నెదర్లాండ్స్ ఓడి.. ఐర్లాండ్ కు బంగ్లా చేతిలో ఓటమి ఎదురైతే విండీస్ కు ఘోర పరాభవం తప్పదు. టీ20 ప్రపంచకప్ 2023 క్వాలిఫయర్స్ ఆడిన వెస్టిండీస్ వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ కూడా ఆడాల్సిన పరిస్థితి వస్తుంది.