రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముజ్రా పార్టీని ఎస్ఓటీ పోలీసులు భగ్నం చేశారు. ఫామ్‌హౌస్‌లో అర్ద నగ్నంగా నృత్యాలు చేస్తున్న అమ్మాయిలు, అబ్బాయిలను అరెస్ట్ చేశారు. డ్రగ్స్‌తో పాటు పెద్ద మొత్తంలో మద్యంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముజ్రా పార్టీ నిర్వహించిన నిర్వాహకుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి…
మొయినాబాద్ మండలం ఏతబర్ పల్లి గ్రామ శివారులోని హాలీడే ఫామ్‌హౌస్‌లో పుట్టినరోజు వేడుకల పేరుతో కొందరు యువకులు ముజ్రా పార్టీ చేసుకున్నారు. పార్టీ కోసం నిర్వాహకుడు ముంబై నుంచి యువతులను రప్పించాడు. పార్టీలో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి గంజాయి, హుక్కా పీలుస్తూ ఈ లోకాన్నే మైమరచిపోయారు. ముజ్రా పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులు హాలీడే ఫామ్‌హౌస్‌పై దాడులు చేశారు.
Also Read: Priyansh Arya: ఐపీఎల్‌లో ప్రియాంశ్ ఆర్య అరుదైన రికార్డు.. మొదటి బ్యాటర్‌గా..!
హాలీడే ఫామ్‌హౌస్‌పై దాడిలో ఎస్ఓటీ పోలీసులు 7 మంది అమ్మాయిలతో పాటు 12 యువకులను అరెస్ట్ చేశారు. ముజ్రా పార్టీ నిర్వహించిన నిర్వాహకుడిని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌తో పాటు పెద్ద మొత్తంలో మద్యంను సీజ్ చేశారు. యువకులు అందరూ పాత బస్తీకి చెందిన వారీగా పోలీసులు గుర్తించారు. నిర్వాహకుడి నుంచి మరింత సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
