Site icon NTV Telugu

Medak: చేతబడి అని అనుమానం.. చెట్టుకు కట్టేసి చితకొట్టిన గ్రామస్తులు

Medak

Medak

Medak: మంత్రాలకు చింతకాయలు రాలుతాయా ? ఇది మన పెద్దలు తరచూ వాడే మాట. వెనుకటి కాలం లో కొంతమంది హేతు వాదులు, మంత్రాలు తంత్రాలు మీద నమ్మకం లేని వారి నోటినుండి పుట్టిన మాట కావచ్చు ఇది . చెట్టుమీద ఉన్న చింతకాయలు కావాలంటే చెట్టెక్కి కోసుకోవడమో, పెద్ద గడ పెట్టి కోయడమో చేయాలి కానీ , చెట్టు క్రిందకు వెళ్లి చింతకాయలు ను చూస్తూ మంత్రం పఠిస్తే అవి రాలవు కదా? అని దీనిలోని భావం. చింతకాయలు రాల్చె విషయంలో మంత్రాలు ఫెయిల్ కావచ్చేమో కానీ అనుమానం మాత్రం అనుకున్నదంతా చేస్తుంది. ఒక మనిషి మీద అనుమానం వచ్చిందంటే జీవితాంతం ఉంటుందనే మాటను సార్థకం చేసారు గ్రామస్తులు.. తమ గ్రామంలో కొందరు చేతబడి చేశారనే నెపంతో ఇద్దరిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అంతేకాదు ఆ చేతబడి ఎందుకు చేశారని ప్రశ్నించిన వారు సమాధనం చెప్పకపోవడంతో నిజాన్ని ఎప్పకోవలని చితకొట్టారు. ఈఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.

Read also: Food Inflation In India: సెప్టెంబర్లో జోరుగా వర్షాలు.. తగ్గనున్న నిత్యావసరాల ధరలు

మెదక్ జిల్లాలో చేతబడి చేస్తున్నారని ఇద్దరిని చెట్టుకు కట్టేసి బంధించారు గ్రామస్తులు. ఈఘటన నర్సాపూర్ మండలం పాప్య తండాలో ఘటన జరిగింది. నిన్న అమావాస్య కావడంతో తండాలో పలువురి ఇంటి ముందు గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయలు, పసుపు కుంకుమ చల్లినట్లు ఆనవాళ్లు కనిపించాయి. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందారు. ఈ పని ఎవరిదై ఉంటుంది. ఎందుకు ఇలా చేశారంటూ భయభ్రాంతులకు లోనయ్యారు. అయితే అదే రాత్రి అనుమానాస్పదంగా నరేష్, భాస్కర్ అనే ఇద్దరు వ్యక్తులు తిరుగుతుండటం గమనించారు. వారిద్దరిని ఎందుకు ఇలా తిరుగుతున్నారని ప్రశ్నించగా.. పొంతలేని సమాధానం చెప్పడంతో వారిపై మంత్రాలు చేస్తున్నారన్న అనుమానంతో ఇద్దరిని చెట్టుకు కట్టేసారు. నిజం చెప్పాలని ఎందుకు ఇలా తిరుగుతున్నారని ప్రశ్నించారు. అయినా వారిద్దరు సమాధానం చెప్పకపోవడంతో వారిపై దాడి చేశారు. నిజం ఓప్పుకోవాలని, చేతబడి ఎందుకు చేశారో చెప్పాలని అన్నారు.
Navdeep: అక్కడ అంత రచ్చ జరుగుతుంటే ఇక్కడ రొమాన్స్ ఏంటి గురూ?

Exit mobile version