తాజాగా పిల్లల దత్తత తీసుకున్న కేసుకు సంబంధించి కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్ సోను గౌడ ను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు. గత వారంలో ఆవిడ ఓ పాపను అక్రమంగా దత్తత తీసుకున్నారని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇందుకు సంబంధించి సోమవారం తను ఎలాంటి తప్పు చేయలేదని తనకు తెలిసిన వరకు దత్తత పనులకు సంబంధించి నియమాలు పాటిస్తూ పాపను దత్తత తీసుకున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Also read: Israel–Hamas war: యూఎన్లో కాల్పుల విరమణ ప్రతిపాదనకు ఆమోదం.. అమెరికాపై ఇజ్రాయెల్ ఆగ్రహం..
45 రోజుల క్రితం ఓ చిన్నారిని అర్ధరాత్రి సమయంలో తన తల్లిదండ్రులతో మాట్లాడి ఓ బాలికను తీసుకోచ్చుకుంది సోను గౌడ. ఇందుకు సంబంధించి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ లో వీడియోని పోస్ట్ చేసింది. ఆ వివరాలను కూడా ఆవిడ పోలీసులకు తెలిపింది. ఇకపోతే ఆ సమయంలో ఈ కేసు పై కోర్టుకు హాజరైన సోను గౌడను ఐదు రోజుల పోలీస్ కస్టడీకి ఆదేశించింది కోర్టు. అయితే ఐదు రోజుల్లో విచారణ పూర్తికానందున మరింత సమయం కావలసి రావడంతో మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పొడిగించాలంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.
Also read: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
ఇక ఆ చిన్నారిని దత్తత తీసుకున్న సమయంలో వారి తల్లిదండ్రులకు ఖరీదైన బహుమతి ఇచ్చానని.. ఆ పాపతో రీల్స్ చేయించి పబ్లిసిటీ కూడా పొందానని., కాకపోతే దత్తత తీసుకున్న తర్వాత నిబంధనలు పాటించలేదని తెలిపింది. అయితే ఈ విషయంపై అక్రమంగా బిడ్డను దత్తత తీసుకున్నందున అభియోగంపై ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించిన అనేక కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఇక ఈ దత్తత విషయం చట్టబద్ధంగా జరిగిందా లేక మరి ఏదైనా జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఇక హిందూ దత్తత చట్ట ప్రకారం సోను గౌడ్ పాపను దత్తత తీసుకోలేదని పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే ఆవిడపై పోలీస్ కస్టడీ కొనసాగుతుంది. ఏప్రిల్ 8 వరకు జ్యూడిషియల్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. దత్తత తీసుకునే విషయంలో హక్కును ఉల్లంగించినందుకుగాను జైలు శిక్షను కూడా ఎదురుకోవాల్సి ఉంటుందని న్యాయనిపుణులు ఆమెపై అభిప్రాయపడుతున్నారు.