Site icon NTV Telugu

Sonia Gandhi: క్షీణించిన సోనియా గాంధీ ఆరోగ్యం.. గంగారాం ఆసుపత్రికి తరలింపు..

Soniagandhi

Soniagandhi

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చేరారు. ఉదర సంబంధిత సమస్య కారణంగా ఆమెను ఆసుపత్రి గ్యాస్ట్రోలజీ విభాగంలో చేర్చినట్లు ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సోనియా గాంధీ ఆరోగ్యం గురించి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. సోనియా గాంధీ గత కొన్ని సంవత్సరాలుగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.

Also Read:Nagarjuna : కుబేర హీరో శేఖర్ కమ్ములనే.. మూవీ కొత్తగా ఉంటుంది

78 ఏళ్ల సోనియా గాంధీ జూన్ 7న కొన్ని స్వల్ప ఆరోగ్య సమస్యల కారణంగా సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (IGMC)లో చేరారు. అక్కడ, వైద్యుల బృందం ఆమెకు సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. ఆ తర్వాత ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. 2022 సంవత్సరంలో కూడా, ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో రెండుసార్లు చేరారు. ఆ సమయంలో, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వైరల్ జ్వరం, తరువాత కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరింది.

Exit mobile version