NTV Telugu Site icon

Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ నుంచి సాంగ్ వచ్చేస్తుంది.. స్పెషల్ అప్డేట్ వైరల్..

Kalki (1)

Kalki (1)

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898ఎడి’.మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ,లోకనాయకుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ స్టార్స్  ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.బిగ్గెస్ట్ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీగా తెరకెక్కుతున్న”కల్కి” మూవీని మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.

దీనితో మేకర్స్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు.ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నారు.తాజాగా ఈ చిత్రం నుంచి ఓ స్పెషల్ అప్డేట్ వైరల్ అవుతుంది.ఈనెల 22న ప్రత్యేక ప్రచార చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీనికోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో భారీ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఆ ప్రత్యేక ఈవెంట్ లోనే ఈ మూవీ నుంచి సాంగ్ ను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఈవెంట్ లో కల్కి మూవీ చిత్ర యూనిట్ అంతా పాల్గొననున్నారు. ప్రస్తుతం ఆ భారీ ఈవెంట్ కు సంబంధించి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.