Site icon NTV Telugu

Sonam Raghuvanshi case: “నా చెల్లిని ఉరితీయాలి”.. సోనమ్ సోదరుడి డిమాండ్..

Sonam Raghuvanshi Case

Sonam Raghuvanshi Case

Sonam Raghuvanshi case: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో భర్త రాజా రఘువంశీని చంపినట్లు ఆయన భర్త సోమన్ రఘువంశీ పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. గత రెండు వారాలుగా ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజా మే 23 నుంచి కనిపించకుండాపోయారు. చివరకు జూన్ 02న మేఘాలయ కాసీ హిల్స్‌లో మృతదేహంగా దొరికాడు. విచారణలో భార్య సోనమ్, ఆమె లవర్ రాజ్ కుష్వాహా మర్డర్‌కి ప్లాన్ చేసినట్లు తేలింది. ముగ్గురు కిరాయి హంతకులు హత్యకు పాల్పడ్డారు. చివరకు, సోనమ్ జూన్ 08న పోలీసులు ముందు లొంగిపోయింది.

Read Also: Kaleshwaram Project: రిపోర్ట్ వచ్చాక చర్యలు తప్పవు.. ఎంత పెద్దవాళ్లు ఉన్నా వదలం: పొంగులేటి

అయితే, సోనమ్ ని తమ కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నామని, ఇకపై ఆమెతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని ఆమె సోదరుడు గోవింద్ అన్నారు. ఆమె దోషి, ఆమెను ఉరితీయాలని ఆమె కుటుంబం కోరుకుంటున్నట్లు చెప్పారు. బుధవారం, ఇండోర్‌లోని సోమన్ అత్తమామల ఇంటికి వెళ్లిన గోవింద్, రాజా రఘువంశీ తల్లిదండ్రుల్ని ఓదార్చారు.

వివాహం జరిగిన 12 రోజులకే భర్తను సోనమ్ హతమార్చింది. “నేను రాజా కుటుంబానికి క్షమాపణలు చెప్పాను. నా సోదరిని ఈ కుటుంబానికి ఇచ్చాను , నేను ఇప్పుడు ఈ కుటుంబంలో భాగమయ్యాను. నా కుటుంబం సోనమ్‌తో అన్ని సంబంధాలను తెంచుకుంది. సోనమ్ దోషి అయితే, ఆమెను ఉరితీయాలి” అని గోవింద్ అన్నారు. రాజ్ కుష్వాహా సోనమ్‌ను ఎప్పుడూ అక్క అని పిలిచేవాడని, గత మూడేళ్లుగా సోనమ్ కుష్వాహాకు రాఖీ కడుతుండేదని గోవింద్ చెప్పాడు.

Exit mobile version