NTV Telugu Site icon

Sonakshi Sinha: హీరోయిన్స్ విషయంలోనే దర్శకనిర్మాతలు అలా ఎందుకు అడుగుతారో: సోనాక్షి

Sonakshi Sinha Remuneration

Sonakshi Sinha Remuneration

Sonakshi Sinha Comments on Heroines Remuneration: బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తాజాగా ‘హీరామండి’ వెబ్‌ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ వెబ్‌ సిరీస్‌.. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయి మంచి సక్సెస్ అందుకుంది. హీరామండిలో రెహానా, ఫరీదన్ జహాన్ అనే రెండు పాత్రలను సోనాక్షి చేశారు. ముఖ్యంగా ఫరీదన్ పాత్రకు గాను ప్రశంసలు అందుకున్నారు. తాజాగా కపిల్ షోలో పాల్గొన్న సోనాక్షి.. రెమ్యునరేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘ప్రతి సినిమాలో నా పాత్ర స్థాయిని బట్టి నేను రెమ్యునరేషన్‌ తీసుకుంటాను. సినిమా కోసం దర్శకనిర్మాతలు నన్ను సంప్రదించగానే.. రెమ్యునరేషన్‌ విషయాన్ని స్పష్టంగా చెబుతాను. కొందరు తగ్గించాలని కోరతారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలోనే ఎందుకు అలా అడుగుతారో నాకు అర్థం కాదు. స్త్రీలు ఎన్నో విషయాల్లో బయట పోరాటం చేస్తున్నారు. ఇండస్ట్రీలో హీరోయిన్స్ కూడా పారితోషికం విషయంలో పోరాడుతున్నారు’ అని సోనాక్షి సిన్హా అన్నారు.

Also Read: Mehreen Pirzada: నకిలీ వార్తలను రాయడం మానుకోండి.. మీడియాపై మెహ్రీన్ ఫైర్!

2010లో వచ్చిన సల్మాన్ ఖాన్ ‘దబాంగ్‌’ సినిమాతో సోనాక్షి సిన్హా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు. రౌడీ రాథోడ్, ఆర్ రాజ్ కుమార్, డబుల్ ఎక్సెల్, లుతేర, అకిరా లాంటి సినిమాలతో సోనాక్షి స్టార్ అయ్యారు. హీరామండితో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. హీరామండి వెబ్‌ సిరీస్‌ కోసం సోనాక్షి 2 కోట్లకు పైనే రెమ్యునరేషన్‌ తీసుకున్నారట.