Site icon NTV Telugu

Sonakshi Sinha : మా మధ్య గొడవలు జరిగిన మాట నిజమే.. విడాకుల రూమర్స్‌పై స్పందించి బాలీవుడ్ బ్యూటీ

Sonakshi Sinha Divors

Sonakshi Sinha Divors

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా మరియు నటుడు జహీర్ ఇక్బాల్ పెళ్లయిన కొద్ది రోజులకే విడాకులు తీసుకుంటున్నారనే వార్తల‌పై సోనాక్షి సిన్హా తాజాగా స్పందించారు. నటి సోహా అలీఖాన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో విడాకుల వార్తలు ‘న్యూసెన్స్’ అని కొట్టిపారేసిన సోనాక్షి, పుకార్లను పక్కనపెట్టి తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నామని తెలిపారు. అయితే, వారిద్దరి మధ్య గొడవలు నిజమేనని ఒప్పుకుంటూ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ‘అందరి ప్రేమకథల మాదిరిగానే మాకు, జహీర్‌కు కూడా గొడవ జరిగింది. ఒకరి అభిప్రాయాల‌ను అర్థం చేసుకోలేక, జుట్టు పట్టుకుని పీక్కునేంతగా గొడవపడ్డాం’ అని సోనాక్షి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ గొడవలు జహీర్‌తో తాను దాదాపు ఏడేళ్లుగా డేటింగ్ చేసిన తర్వాత జరిగాయని ఆమె వెల్లడించారు.

Also Read : Sushanth–Meenakshi : సుశాంత్‌తో మీనాక్షి చౌదరీ పెళ్లి.. అసలు నిజం ఇదే!

గొడవలు జరిగాయి కానీ బ్రేకప్ చెప్పుకోకుండా, సమస్యను పరిష్కరించుకుంటూ వచ్చాం.. కపుల్స్ థెరపీకి కూడా వెళ్ళాం రెండు సెషన్స్‌లోనే మా ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. అది అవతలి వ్యక్తి ఆలోచించే విధానాన్ని, వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి చాలా సహాయపడింది’ అని సోనాక్షి వివరించారు. ముఖ్యంగా, జహీర్ ఇతరులను గౌరవించే విధానం తనకు ఎంతగానో నచ్చిందని, వారి మధ్య గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం ముఖ్యమని ఆమె తెలిపారు. ఈ విధంగా, కపుల్స్ థెరపీ సహాయంతో తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నామని చెబుతూ, తమ విడాకుల పుకార్లను సోనాక్షి సిన్హా పులిస్టాప్ పెట్టింది.

Exit mobile version