ప్రేమించిన వారిని వదిలి ఉండలేక ఆత్మహత్యలకు పాల్పడిన వారున్నారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోతోంది. ప్రేమించిన వారే తమ ప్రియుడు లేదా ప్రియురాలిని అంతమొందిస్తున్నారు. కొందరు ఎంతటి దారుణాలకైన వెనుకాడడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని బల్లియాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట ఆ తర్వాత కలహాలు మొదలై ఏకంగా భర్త భార్యను, అత్తను హత్య చేశాడు.
Also Read: JD Chakravarthy: అదే మలయాళ సినిమాలు మనవాళ్లు తీస్తే చూడరు.. జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు!
బచైపూర్ గ్రామంలో, ఒక అల్లుడు తన అత్తగారి ఇంట్లోకి చొరబడి దారుణమైన దాడికి పాల్పడ్డాడు. అతను తన భార్యను కత్తితో పొడిచి చంపి, ఆ తర్వాత అత్తను హత్య చేశాడు. అమిత్ గుప్తాగా గుర్తించబడిన నిందితుడు, తన భార్య ప్రీతిని, అత్త సుశీలా దేవిని దారుణంగా హత్య చేశాడు. అడ్డుకోబోయిన మామ అంతు గుప్తాపై కూడా దాడి చేశాడు. అంతు గుప్తా తీవ్రగాయాలపాలవడంతో ఆసుపత్రికి తరలించారు.
2022లో ప్రీతి, అమిత్ ప్రేమ వివాహం చేసుకున్నారు. మొదట్లో అంతా సాధారణంగానే అనిపించింది, కానీ కాలక్రమేణా వారి సంబంధంలో మనస్పర్థలు పెరిగాయి. పెళ్లి తర్వాత కూడా వారిద్దరి మధ్య గొడవలు తీవ్రమవుతూనే ఉన్నాయని, పరిస్థితి మరింత దిగజారిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రీతి తన పుట్టింట్లో ఉంటోంది. నిన్న రాత్రి నిందితుడైన అమిత్ అకస్మాత్తుగా అత్తగారింటికి వచ్చాడు. గదిలోకి ప్రవేశించి, తన భార్య నుండి బిడ్డను లాక్కోవడానికి ప్రయత్నించాడు. ప్రీతి ప్రతిఘటించడంతో, అమిత్ ఆగ్రహానికి గురై కత్తితో ఆమెపై దాడి చేశాడు.
Also Read:Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
అత్తమామలు అరుపులు విని ఆమెను రక్షించడానికి రాగా, నిందితుడు వారిపై కూడా దాడి చేశాడు. ప్రీతి, సుశీలా దేవి అక్కడికక్కడే మరణించగా, అంతు గుప్తా తీవ్రంగా గాయపడ్డాడు. నిందితుడు అక్కడి నుంచి పారిపోయారు. ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. తీవ్రంగా గాయపడిన మామగారిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
