NTV Telugu Site icon

Attack on Constable: కానిస్టేబుల్‌పై విచక్షణారహితంగా దాడి.. వివాహేతర సంబంధమే కారణం!

Constable

Constable

Attack on Constable: పెద్దపల్లి జిల్లాలో ఓ కానిస్టేబుల్‌పై కొందరు వ్యక్తులు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ కానిస్టేబుల్‌పై కొందరు విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన సుల్తానాబాద్‌లో చోటుచేసుకుంది. సుల్తానాబాద్‌ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పోచాలు శనివారం రాత్రి ఓ వివాహిత ఇంట్లో ఉండగా.. ఆమె బంధువులు అతడిని బయటకు లాగి కర్రలతో తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో అతని తలకు, ముఖానికి, మర్మాంగంపై తీవ్రమైన గాయాలయ్యాయి.

Read Also: Stray dog: వీధి కుక్క నోటిలో నవజాత శిశువు.. విచారణ కోసం ప్రత్యేక బృందాలు

అటుగా వెళ్తున్న కొందరు యువకులు అంబులెన్సుకు ఫోన్‌ చేశారు. పోచాలును కరీంనగర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా, అక్కడ అతడి పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ఈ సంఘటనపై ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. దాడికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఎస్సై ఉపేందర్‌రావును ఈ సంఘటన గురించి వివరాలు అడుగగా.. దాడి వాస్తవమేనని, దీనిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. సీఐని వివరణ కోరితే తాగుబోతుల మధ్య జరిగిన గొడవగా కొట్టిపారేశారు.