Site icon NTV Telugu

Kolkata: బెంగాల్ నటుడు సోహమ్ చక్రవర్తి దురుసు ప్రవర్తన.. రెస్టారెంట్ యజమానిపై దాడి

Mla

Mla

బెంగాల్ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సోహమ్ చక్రవర్తి రెస్టారెంట్‌లో రెచ్చిపోయారు. సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించారు. రెస్టారెంట్ దగ్గర పార్కింగ్ సమస్య తలెత్తింది. ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమానిని చెంపదెబ్బ కొట్టారు. దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. యజమాని చొక్కా కాలర్ పట్టుకున్న దృశ్యాలు, దాడి దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

ఇది కూడా చదవండి: WhatsApp: గుడ్ న్యూస్.. ఇకపై వాట్సాప్ యూజర్లకు గ్రీన్ టిక్..

కార్లు పార్కింగ్ చేసే విషయంలో ఎమ్మెల్యే సెక్యూరిటీ.. సిబ్బంది మధ్య వివాదం తలెత్తింది. సోహం చక్రవర్తి సెక్యూరిటీ… కార్లు పార్క్ చేసే విషయంలో వివాదం తలెత్తిందని రెస్టారెంట్ యజమాని అభిషేక్ బెనర్జీ చెప్పారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం.. దూషణలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే నటుడిపై రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయితే రెస్టారెంట్ యజమాని దుర్భాషలాడడంతోనే ఎమ్మెల్ చెంపదెబ్బ కొట్టినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి: Relationship Advice: మీ జీవితమంతా ఒంటరిగా ఉండండి కానీ.. ఇలాంటి వ్యక్తులతో డేటింగ్ చేయొద్దు!

Exit mobile version