NTV Telugu Site icon

Gunfire in America: అమెరికాలో కాల్పులు.. తిరుపతి యువకుడికి తీవ్రగాయాలు

Gunfire

Gunfire

Gunfire in America: అగ్రరాజ్యం అమెరికాలో ఎప్పుడూ ఏదో ఒక సిటీలో.. మూలనో కాల్పుల మోత మోగుతూనే ఉంటుంది.. తాజాగా, అమెరికాలో కారుపై దుండగులు జరిపిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు తీవ్రగాయాలపాలయ్యారు.. తిరుపతి జిల్లా ఏర్పేడు మండం గోవిందపురం పంచాయతీకి చెందిన మోహన్ సాయి.. అమెరికాలోని మెమ్సిస్ ప్రాంతంలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు.. అయితే, గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో ఓ స్నేహితుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. ఒక్కసారిగా కారుపై కాల్పులు జరిపారు దుండగులు.. ఈ ఘటనలో మోహన్ సాయి కుడి భుజం, చేతిపై బుల్లెట్లు దిగడంతో తీవ్రంగా గాయాలు అయ్యాయి.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు మోహన్‌ సాయి.. ఇక, ఆ కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడిన స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి‌.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.. కాగా, ఇప్పటికే అమెరికాలో జరిగిన ఎన్నో ఘటనల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ఉద్యోగులు.. ఇలా చాలా మంది గాయాలు పాలుకాగా.. కొందరి ప్రాణాలు కూడా పోయిన విషయం విదితమే..

Read Also: WPL 2025 Final: నేడే ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య ఫైనల్