Site icon NTV Telugu

Software Employee: కుమారుడిని మందలించిన తల్లిదండ్రులు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అదృశ్యం

Software Employee

Software Employee

Software Employee: సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అదృశ్యమైన సంఘటన సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్‌పూర్‌లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న సాయిపవన్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఇతర కంపెనీల్లో పెట్టుబడి పెట్టి ఎదగాలని ఆశ ఉండేది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టి సంపాదించాలనుకున్నాడు. ఎలాగోలా రూ.10 లక్షలు పోగేసి ఆన్‌లైన్‌లో పెట్టుబడి పెట్టాడు. కానీ తర్వాత తాను రూ.10లక్షలు పోగొట్టుకున్నానని తెలిసింది.

Swimming: బామ్మ అదుర్స్.. 82 ఏళ్ల వయసులోనూ మూడు బంగారు పతకాలు

ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. రూ.10లక్షలు పోగొట్టాడని తెలిసిన వారు మందలించారు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన సాయిపవన్‌ ఎవ్వరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. తమ కుమారుడు కనిపించకుండా పోవడంతో భయాందోళనకు గురైన తల్లిదండ్రులు అతని ఫోన్‌కు కాల్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ అని వచ్చింది. వారు పోలీసులను ఆశ్రయించగా.. మిస్సింగ్‌ కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు.

Exit mobile version