NTV Telugu Site icon

Viral Video : వావ్.. ఏం చేస్తిరి.. వీడియో చూస్తే పొట్ట చక్కలు అవ్వడం పక్కా..!

viral video

viral video

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. కొన్ని వీడియోలు చూస్తే ఇంకా చూడాలని అనిపిస్తాయి.. మరికొన్ని వీడియోలను చూస్తే మాత్రం నవ్వాగదు.. తాజాగా ఓ కాలేజీ విద్యార్థులు టీచర్ లేకపోవడంతో క్లాసులో పెళ్లి, అప్పగింతలు సీన్ ను చాలా ఫన్నీగా చేశారు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోను చూసిన వారంతా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో క్లాస్‌రూమ్‌లో ఉన్న స్టూడెంట్స్ పెళ్లి స్కిట్ చేశారు. పెళ్లికి సంబంధించిన ప్రతి ఆచారాన్ని అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి చేస్తున్నారు. ఓ కుర్రాడు వధువుగా, మరో కుర్రాడు వరుడిగా నటించారు. మిగిలిన వారు మిగతా పాత్రలు పోషించారు. అందరూ చాలా ఫన్నీగా నటించారు.. పెళ్లి తంతు ఎలా మొదలవుతుంది నుంచి అప్పగింతలు ఎలా అవుతాయో వరకు అన్నీటిని చాలా చక్కగా వివరించారు..

ఈ వైరల్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ వీడియో చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు. ఈ వీడియోను దాదాపు 5 కోట్ల మంది వీక్షించారు. 44 లక్షల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. `చాలా ఫన్నీగా ఉంది, అమ్మాయి గెటప్ లో ఉన్న అబ్బాయి బాగా చేశాడు.. అంటు కామెంట్స్ చెయ్యడంతో పాటు రకరకాల మీమ్స్ తో వీడియోను మరింత ట్రెండ్ చేస్తున్నారు.. మొత్తానికి వీడియోను చూసినంత సేపు కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది. ఆ వీడియోపై మీరు ఒక లుక్ వేసుకోండి..