సోషల్ మీడియాలో క్రేజ్ కోసమో.. లేక అందరు చూడాలని అనుకుంటారో తెలియదు కానీ కొన్ని వీడియోలను చూస్తే జనాలు షాక్ అవుతారు… ఒక్కొక్కరిది ఒక్కో మనస్తత్వం.. ఎక్కడ ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా చేస్తున్నారు.. వాళ్ల గురించి చూసేవాళ్లు ఏమనుకుంటున్నారో కూడా పట్టించుకోకుండా చేస్తున్నారు.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరు రీల్స్ చేస్తున్నారు.. తాజాగా ఓ వీడియో వైరల్ అవుతుంది..
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు.. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి కదులుతున్న లారీలో ఉయ్యాల కట్టుకుని ఊగుతున్నాడు.. ఆ వీడియో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు… ఓ ఇంస్టాగ్రామ్ యుజర్ ఆ వీడియోను షేర్ చేశారు..ఆ వీడియోలో రద్దీ రోడ్డుపై ఓ లారీ వేగంగా వెళ్తోంది. కదులుతున్న ఆ లారీ వెనుక భాగంలో ఓ వ్యక్తి మంచం వేసుకుని కూర్చున్నాడు. అతడి వెనుకాల ఓ వ్యక్తి తాళ్లను ఉయ్యాలలా ఏర్పాటు చేసుకుని ముందుకూ, వెనక్కీ ఊగుతున్నాడు..
ఆ లారీ వెనుక వస్తున్న వాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యడంతో ఇది వైరల్ గా మారింది.. ఆ వీడియోను మిలియన్ల మందికి పైగా వీక్షించారు. 4.5 లక్షల మంది కంటే ఎక్కువగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను చూసి కొందరు ఎంజాయ్ చేస్తుంటే, మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మొత్తానికి ఆ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.. మీరు ఓ లుక్ వేసుకోండి..