టెక్నాలజీ పెరిగే కొద్ది మనుషుల తీరు మారుతుంది.. టెక్నాలజీ మోజులో పడి ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో మర్చిపోతున్నారు.. ఒక్కోక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది.. అయితే, కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రజలు ఒకే విధంగా చేయాల్సి ఉంటుంది.. అందులో సంప్రదాయాలు.. సంస్కృతి విషయాల్లో తప్పు చెయ్యకూడదు.. తెలియక పోతే తెలుసుకొని చెయ్యాలి.. ఆలయాల పరిసరాల్లో కొలనుల్లో స్నానమాచరించడం, దేవుళ్లను దర్శించుకోవడం చేస్తుంటారు.
ఇంకా కార్యక్రమాలు ఉంటే.. వాటిని సైతం అనుసరిస్తాయి. ఇప్పుడిదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. తాజాగా ఓ అమ్మాయికి సంబంధించిన ఫన్నీ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతోంది… సాధారణంగా దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ కోనేరులు ఉంటాయి.. అందులు భక్తులు నాణెలు వేసి తమ కోరికలను నేరవేర్చాలని కోరుకుంటారు. ఇలా ఆలయాల్లో ఇలాంటివి మనం చూస్తూనే ఉంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలోనూ ఇదే సీన్ ఉంది. ఆలయం లో చిన్న కోనేరులాంటి నీటి గుంట ఉండగా.. భక్తులు అందులో నాణేలు వేస్తున్నారు. ఈ క్రమంలో ఓ అమ్మాయి తన తెలివినంతా ప్రదర్శించింది..
ఆ అమ్మాయి కావాలని చేసిందా.. లేదా తెలియక చేసిందా అనేది తెలియలేదు కానీ ప్రస్తుతం ఆ అమ్మాయి వీడియో మాత్రం నెట్టింట వైరల్ అవుతుంది.. కోనేరులో నాణేలకు బదులుగా డెబిట్ కార్డ్‌ను తీసింది. ఆ కార్డును కొలను నీటిలో స్వైప్ చేసింది. అయితే, ఈ దృశ్యాన్ని పక్కనే ఉన్న కొందరు భక్తులు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. దానిని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అది కాస్తా వైరల్ అయ్యింది. వీడియోను చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.. మరి కొందరు అమ్మో దండం తల్లే.. నీ తెలివికి దండ వెయ్యాల్సిందే.. అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ఇలాంటి వాళ్ళు ఒక్కరుంటే చాలు దేశం ఎక్కడికో వెళ్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.. చెప్పడం ఎందుకు మీరే ఒకసారి చూసి ఒక కామెంట్ వేసుకోండి..
Big brain time 🤯 pic.twitter.com/QgFvcR7DZP
— Arehoo_official (@tweetsbyaravind) June 22, 2023