NTV Telugu Site icon

Snake Security: దొంగలు కూడా మనషులే సార్.. ఇలాంటి సెక్యూరిటీ ఎవరైనా పెడతారా?

Security

Security

Snake Security For Home: మనం రకరకాల సెక్యూరిటీని చూసుంటాం. కొన్ని ఇళ్లకు సెక్యూరిటీ గార్డులు కాపలా ఉంటారు. మరి కొన్నింటికి కుక్కలు కాపలా ఉంటాయి. ఇక వాటిని కూడా వద్దు అనుకుంటే ఏ డిజిటల్ లాక్స్, ఆలరాంలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. అయితే ఆస్ట్రేలియాలో ఓ ఇంటి సెక్యూరిటీని చూస్తే మాత్రం ఆ ఇంటి వైపు వెళ్లే సహసం ఎవరు చేయరు. ఇంతకీ ఆ ఇంటికి ఉన్న అంత గొప్ప సెక్యూరిటీ ఏంటీ అనుకుంటున్నారా? ఆ సెక్యూరిటీ మరేదో కాదు ఓ పెద్ద పాము. దానిని కరెక్ట్ గా డోర్ హ్యాండెల్ దగ్గర ఉంచారు.

Also Read: Fines For Cancelling Rides of Uber and Ola: ఓలా, ఉబర్ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్..

మనం ఇండియన్  సినిమాల్లో చాలా సార్లు తాళ పత్ర గంధ్రాలకు కాపలాగా పాములు ఉండటం చూశాం. కొన్ని కొన్ని సార్లు గుప్త నిధులకు రక్షగా కూడా పాములను బంధించి ఉంచడం చూశాం. అయితే అవి కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం. అయితే ఈ ఇంటిలో ఉన్న పామును చూస్తే మాత్రం నిజంగానే పామును మంత్రించి ఇంటికి కాపల ఉంచారా అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఫన్నీ ఎక్స్ అనే ఎక్స్( ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. నెక్ట్స్ లెవల్ సెక్యూరిటీ అంటూ క్యాప్షన్ జోడించి దీనిని పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఇది సెక్యూరిటీ కోసం ఉంచిన పాము కాదని అనుకోకుండా ఇంట్లోకి వస్తే ఫోటో తీశారంటూ కొంత మంది కామెంట్ చేస్తున్నారు. మరి ఆ ఇంట్లో వారు లోపలికి వెళ్లాలంటే ఎలా కిటికీలో నుంచి వెళతారా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. నిజంగానే సూపర్ సెక్యూరిటీ, ఆ ఇంట్లోకి దొంగలే కాదు ఎవరూ రారు అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఆ వీడియో చూస్తుంటే కూడా ఆ పాము నిజంగానే సెక్యూరిటీ గార్డు లాగా చాాలా అలర్డ్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎవరైనా వస్తే అంతే ఖతం అన్నట్లు రెడీగా కాచుకొని ఉన్నట్లు అనిపిస్తోంది.