Snake Hiding Places: మీ ఇంట్లోకి పాము వచ్చిందా..? వాటికి ఇష్టమైన.. అవి దాక్కునే ప్రదేశాలు ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snake Hiding Places: ఓవైపు ఎండలు.. మరో వైపు అకాల వర్షాల సమయంలో.. పుట్టల్లో నుంచి పాములు ఎక్కువగా బయటకు వస్తాయని చెబుతారు.. వేసవి, వర్షాకాలాల్లో పాములు చల్లని మరియు సురక్షితమైన ప్రదేశాల కోసం వెతుకుతూ తరచుగా ఇళ్లలోకి ప్రవేశిస్తుంటాయి. ముఖ్యంగా పొలాలు, చెట్లు, చెరువులు లేదా అడవులకు సమీపంలో నివసించే వారి ఇళ్లలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. చాలామంది తలుపులు మూసి ఉంచితే సరిపోతుందని భావిస్తారు. కానీ, పాములు చాలా చిన్న రంధ్రాలు, పగుళ్ల ద్వారా కూడా ఇంట్లోకి చేరుకోగలవు.. ఇంట్లో కొన్ని ప్రదేశాలు మనం పెద్దగా పట్టించుకోము. అయితే అవే పాములకు ఆశ్రయాలుగా మారే అవకాశముంది. అందుకే ఇంట్లో ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
చీకటి, తేమగా ఉండే మూలలు
పాములు సాధారణంగా చల్లగా, చీకటిగా, ప్రశాంతంగా ఉండే ప్రదేశాలను ఇష్టపడతాయి. స్టోర్‌రూమ్‌లు, పాత పెట్టెలు ఉన్న మూలలు, పనికిరాని వస్తువులు పేరుకుపోయిన ప్రదేశాలు, మెట్ల కింద ఖాళీ ప్రదేశాలు వాటికి అనువైన దాక్కునే చోట్లుగా మారుతాయి. ఇలాంటి ప్రదేశాల్లో మనుషుల రాకపోకలు తక్కువగా ఉండటం వల్ల పాములు సురక్షితంగా భావిస్తాయి. కాబట్టి స్టోర్‌రూమ్‌ను తరచుగా శుభ్రం చేయడం మంచిది.
Also Read
- Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- CJP Protest: అభిజిత్ దీప్కే విడుదల.. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా ఇంకా జైలులో ఎందుకు?
- Kiren Rijiju: ‘‘భారత్ బంగ్లాదేశ్ కాదు’’.. ప్రతిపక్షాలకు కిరెన్ రిజిజు వార్నింగ్..
బాత్రూమ్లు, డ్రైనేజీ పైపులు
వింతగా అనిపించినా, పాములు బాత్రూమ్ సింక్లు, టాయిలెట్ పైపులు, డ్రైనేజీ లైన్ల ద్వారా కూడా ఇంట్లోకి రావచ్చు. పైపుల్లో ఉండే తేమ, అలాగే అక్కడ సంచరించే కప్పలు, ఎలుకలు వంటి జీవులు పాములను ఆకర్షిస్తాయి. డ్రైనేజీ గ్రిల్స్ విరిగిపోయి ఉంటే వెంటనే మరమ్మతు చేయించాలి.
వంటగది ఉపకరణాల వెనుక భాగాలు
వంటగదిలో ఫ్రిజ్ వెనుక భాగం, ఓవెన్ కింద ఖాళీ ప్రదేశం, గ్యాస్ స్టౌవ్ చుట్టూ ఉండే మూలలు పాములకు ఇష్టమైన దాక్కునే ప్రాంతాలు కావచ్చు. వేడి మరియు ప్రశాంత వాతావరణం ఉండటంతో అవి అక్కడ దాక్కుంటాయి. అందువల్ల వంటగది వెనుక భాగాలను కూడా తరచుగా పరిశీలించాలి.
అల్మారాలు, షూ ర్యాక్‌లు
నేలకు దగ్గరగా ఉండే అల్మారాలు, మూసి ఉంచిన కబ్బోర్డులు, షూ ర్యాక్‌లు కూడా పాములు దాక్కునే ప్రదేశాలుగా మారవచ్చు. ముఖ్యంగా బయట ఉంచిన బూట్లు, చెప్పుల్లో అవి చుట్టుకొని ఉండే అవకాశముంది. అందుకే బూట్లు వేసుకునే ముందు ఒకసారి బాగా చూసుకోవాలి.
శుభ్రం చేసే సమయంలో జాగ్రత్తలు
చాలా రోజులుగా మూసి ఉన్న గది, పెట్టె లేదా మూలను శుభ్రం చేయాలనుకుంటే నేరుగా చేతులతో తాకకండి. ముందుగా ఒక కర్ర లేదా పొడవైన వస్తువుతో కదిలించి చూసి, తర్వాత మాత్రమే శుభ్రం చేయాలి. అవసరమైతే గ్లౌజులు ధరించడం మంచిది.
ఎలా జాగ్రత్త పడాలి?
ఇంటి చుట్టూ చెత్త పేరుకోనివ్వకండి. గోడలలో పగుళ్లు ఉంటే మూసేయండి. తలుపుల కింద గ్యాప్ ఉంటే సీల్ చేయండి. ఎలుకలు, కప్పలు ఎక్కువగా తిరిగే ప్రదేశాలను శుభ్రంగా ఉంచండి. పాము కనిపిస్తే స్వయంగా పట్టుకోవడానికి ప్రయత్నించకుండా వెంటనే అటవీశాఖ లేదా స్థానిక స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇవ్వాలి. జాగ్రత్తగా ఉంటే పాముల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!