NTV Telugu Site icon

Snake Venom: డార్జిలింగ్‌లో 2.5కేజీల పాము విషం పట్టివేత.. విలువ రూ.30కోట్లు

New Project (12)

New Project (12)

Snake Venom: పశ్చిమబెంగాల్‌ డార్జిలింగ్‌ జిల్లాలోని ఘోష్‌పుకూర్‌ అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు ఫారెస్ట్ అధికారులు. ఫన్సిడేవా ప్రాంతంలో సోదాలు జరిపిన అధికారులు అక్రమంగా తరలిస్తున్న రెండున్నర కిలోల విషాన్ని గుర్తించారు. ఈ విషానికి మార్కెట్లో రూ. 30 కోట్ల వరకు రేటు పలుకుతుందని ఘోష్పుకూర్ అటవీ రేంజ్ రేంజర్ సోనమ్ భూటియా తెలిపారు. దీనిని ఓ క్రిస్టల్ జార్ లో భద్రపరిచారు. ఇందులో భాగంగా అక్రమ రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వ్యక్తిని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాకు చెందిన మహ్మద్ సరాఫత్‌గా గుర్తించారు.

Read Also: IT Employees: ఆఫీసుకు మేం రామంటున్న ఎంప్లాయీస్.. కలవరపడుతున్న ఐటీ కంపెనీలు

“అంతర్జాతీయ మార్కెట్ రేటు ప్రకారం, స్వాధీనం చేసుకున్న సరుకు విలువ సుమారు రూ. 30 కోట్లు. దీనికి సంబంధించి ఒకరిని అరెస్టు చేశాం. ఈ విషం ఫ్రాన్స్‌కు చెందినది మరియు బంగ్లాదేశ్ మీదుగా భారతదేశంలోకి అక్రమంగా రవాణా చేయబడింది. క్రిస్టల్ కంటైనర్‌కు ఫ్రెంచ్ ట్యాగ్ ఉంది’ అని అధికారులు తెలిపారు. ఈ విషాన్ని నేపాల్ మీదుగా చైనాకు తరలించాలన్నదే అసలు ఉద్దేశమని నిందితుడి తెలిపాడు.

Read Also: Monkey: ఆ గ్రామంలో కోతుల పేరిట 32 ఎకరాల భూమి

“సరఫత్ ఈ ప్రాంతం గుండా పాము విషాన్ని స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడని… అతను మోటారుసైకిల్‌లో సరుకును తీసుకువెళుతున్నాడని నిఘా వర్గాల నుంచి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని అటవీ శాఖ అధికారులు 35 రోజుల వ్యవధిలో పాము విషాన్ని స్వాధీనం చేసుకోవడం ఇది రెండోసారి. సెప్టెంబర్ 10న జల్పాయ్ గురి జిల్లాలో రూ.13 కోట్ల విలువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు.