Site icon NTV Telugu

Smriti Mandhana: స్మృతి మంధాన పెళ్లి కథలో కొత్త ట్విస్ట్.. పలాష్ తల్లి సంచలన వ్యాఖ్యలు

Smriti Mandhana

Smriti Mandhana

Smriti Mandhana: లెజెండరీ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన ప్రస్తుతం తన పెళ్లి కారణంగా వార్తల్లో నిలిచింది. ఈ స్టార్ క్రికెటర్ వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉండగా, ఆమె తండ్రి గుండెపోటు కారణంగా దానిని వాయిదా వేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు స్మృతి మంధానకు కాబోయే భర్త పలాష్ ముచ్చల్ తల్లి అమితా ముచ్చల్ ఒక ముఖ్యమైన విషయాన్ని వెల్లడించింది. ఇప్పటి వరకు ఈ వివాహాన్ని వాయిదా వేసింది ఈ స్టార్ క్రికెటర్ వాయిదా వేసిందని అందరూ అనుకున్నారు. కానీ ఈ పెళ్లిని వాయిదా వేయాలనే నిర్ణయం మొదట్లో తన కుమారుడు పలాష్ తీసుకున్నారని అమితా వెల్లడించారు.

READ ALSO: Local Body Elections : ఎన్నికల అలర్ట్..! కీలక తేదీలు ఇవే..!

పలాష్ ముచ్చల్ తల్లి ఏం చెప్పారు..
పలాష్ ముచ్చల్ తల్లి అమిత మీడియాతో మాట్లాడుతూ.. తన కొడుకు స్మృతి తండ్రికి చాలా సన్నిహితుడని వివరించారు. స్మృతి తండ్రిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లిన వెంటనే, తనే వివాహ ఆచారాలు, ఇతర వేడుకలను వాయిదా వేయమని కోరాడని వెల్లడించింది. “పలాష్‌కు తన మామతో చాలా అనుబంధం ఉంది. తండ్రికుమార్తెల కంటే, మామా అల్లుడికి అనుబంధం ఎక్కువగా ఉంటుంది. ఆయనకు గుండె పోటు వచ్చిన తర్వాత పలాష్, స్మృతి కంటే ముందే వివాహాన్ని నిర్వహించకూడదని నిర్ణయించుకున్నాడని, తన మామ కోలుకునే వరకు పెళ్లి వాయిదా వేయాలని నిర్ణయించుకున్నాడు” ఆమె తెలిపారు.

స్మృతి మంధాన తండ్రి శ్రీనివాస్ అనారోగ్యానికి గురైన తర్వాత, పలాష్ ఆరోగ్యం కూడా క్షీణించింది. ఆయన వైరల్ ఇన్ఫెక్షన్, అసిడిటీతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం పలాష్ ముంబై ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నాడు. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు స్మృతి మంధాన తన వివాహానికి సంబంధించిన అన్ని పోస్ట్‌లను సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించింది. అలాగే ఆమె భారత క్రికెటర్ స్నేహితులు కూడా పెళ్లి ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలను వారి సోషల్ మీడియా ఖాతాల నుంచి తొలగించారు. ప్రస్తుతానికి అయితే పలాష్ – స్మృతి వివాహం వాయిదా పడింది. కొత్త వివాహ తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో వేచి చూడాల్సి ఉంది.

READ ALSO: Lady Dons: భారతదేశంలో టాప్ 5 లేడీ డాన్స్.. వాళ్ల నేర చరిత్ర ఇదే!

Exit mobile version