AUS W vs IND W: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు, భారత మహిళల క్రికెట్ జట్టు మధ్య జరిగిన చివరిదైన మూడవ వన్డే మ్యాచ్ పెర్త్‌లోని డబ్ల్యూఏసీఏ మైదానంలో మధ్య జరిగింది. మూడో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు 83 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించింది. దీంతో ఆస్ట్రేలియా 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ టీమిండియాకు సారథ్యం వహించింది. ఇకపోతే, మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు ఆరంభంలో కేవలం 78 పరుగులకే జట్టులోని నలుగురు ముఖ్యమైన బ్యాట్స్‌మెన్స్ పెవిలియన్‌కు చేరుకున్నారు. దీని తర్వాత అన్నాబెల్ సదర్లాండ్, యాష్లే గార్డనర్ కలిసి ఇన్నింగ్స్‌ను భారీ స్కోర్ దిశగా తీసుకవెళ్లారు. దింతో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తరపున, అన్నాబెల్ సదర్లాండ్ కేవలం 95 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 110 పరుగులతో సెంచరీ ఇన్నింగ్స్ ఆడింది.
అరుంధతి రెడ్డి టీమ్ టీమిండియా తరఫున అరుంధతిరెడ్డి అత్యధికంగా నాలుగు వికెట్లు పడగొట్టింది. అరుంధతిరెడ్డికి కాకుండా దీప్తి శర్మకు ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే టీమిండియా 50 ఓవర్లలో 299 పరుగుల భారీ లక్ష్యం ఛేదించాల్సి వచ్చింది. లక్ష్య ఛేదనలో టీమిండియాకు కేవలం 16 పరుగుల స్కోరు వద్ద మొదటి వికెట్ పడింది. మూడో వన్డేలో భారత జట్టు మొత్తం 45.1 ఓవర్లలో కేవలం 215 పరుగులకే పరిమితమైంది. టీమిండియా తరఫున ఓపెనర్ స్మృతి మంధాన అత్యధికంగా ఇన్నింగ్స్‌లో 105 పరుగులు చేసింది. స్మృతి మంధానతో పాటు హర్లీన్ డియోల్ 39 పరుగులు చేసింది. ఇక ఆస్ట్రేలియా తరఫున యాష్లే గార్డనర్ అత్యధికంగా ఐదు వికెట్లు పడగొట్టింది. ఆష్లే గార్డనర్‌తో పాటు మెగాన్ షట్, అలనా కింగ్ చెరో రెండు వికెట్లు తీశారు.