Smriti Irani Daughter: స్మృతి ఇరానీ కూతురి పెళ్లి.. ముస్తాబైన రాజకోట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Smriti Irani Daughter Marriage: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇంట పెళ్లివేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఆమె ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. స్మృతి ఇరానీ కూతురు షనెల్ ఇరానీ గురువారం వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. షనెల్ ఇరానీ అర్జున్ భల్లాతో కలిసి ఏడడుగులు వేయనున్నారు. వీరిద్దరి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మంత్రి స్మృతి ఇరానీ ఏర్పాట్లు ఘనంగానే చేస్తున్నట్లు తెలిసింది. వీరి వివాహ వేడుక రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గల 15వ శతాబ్ధం నాటి ఖిన్వసార్ రాజకోటలో వైభవంగా జరగనుంది. ఈ పెళ్లి వేడుకల కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఇప్పటికే జోధ్‌పూర్ చేరుకున్నారు. పెళ్లి వేడుకల కోసం ఖిన్వసార్ రాజకోట ఇప్పటికే ముస్తాబైంది.
మాజీ మంత్రి ఖిన్వసార్.. స్మృతి ఇరానీ కుమార్తె పెళ్లి వేడుకల పూర్తి బాధ్యతలు తీసుకున్నారని సమాచారం. బుధవారం ఉదయం నుంచే వివాహ ముందస్తు వేడుకలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. పార్సీ, పంజాబీ రెండు ఆచారాల్లో వివాహం జరగనుందని తెలుస్తోంది. షనెల్ పరిణయానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. కాగా, స్మృతి ఇరానీ కుమార్తె షనెల్ ఇరానీకి అర్జున్ భల్లాతో 2021 డిసెంబరులో నిశ్చితార్థం జరిగింది. ముంబయిలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో లా కోర్సు పూర్తి చేసిన షనెల్ ఇరానీ.. ఆ తర్వాత వాషింగ్టన్ డీసీలోని జార్జ్‌టౌన్ వర్సిటీ నుంచి ఎల్ఎల్ఎమ్ పట్టా పొందారు. షనెల్ ఇరానీకి కాబోయే భర్త అర్జున్ భల్లా కెనడాలో నివసిస్తున్నారు.
Also Read
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
- Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
- KL Rahul: కేఎల్ రాహుల్ యాక్టింగ్.. ఆస్కార్ ఇవ్వాల్సిందే.. మోసపోయిన ఆఫ్ఘనిస్తాన్ కీపర్, కెప్టెన్..
- Cockroach Janta Party: ఇది ట్రైలర్ మాత్రమే.. కాక్రోచ్ జనతా పార్టీ హెచ్చరిక..
Wedding Bells: పెళ్ళి విషయంలో ‘నేనింతే’ అంటున్న శియా!
అర్జున్ భల్లా కెనడాకు చెందిన న్యాయవాది. అర్జున్ కెనడాలో పుట్టి అక్కడే స్థిరపడినప్పటికీ అతని తల్లిదండ్రులు, తాతలు భారతదేశానికి చెందినవారు. అర్జున్ తండ్రి పేరు సునీల్ భల్లా కాగా తల్లి పేరు షబీనా భల్లా. ఒక నివేదిక ప్రకారం, అర్జున్ భల్లా తన పాఠశాల విద్యను కెనడాలోని అంటారియోలోని సెయింట్ రాబర్ట్ కాథలిక్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశాడు. అతను 2009 నుంచి 2013 మధ్య కెనడాలోని టొరంటోలోని సెయింట్ మైఖేల్ కళాశాలలో సైకాలజీ, ఎథిక్స్, లా అండ్ సొసైటీలో బ్యాచిలర్స్ డిగ్రీని చదివాడు. అనంతరం ఆయన యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లీసెస్టర్ విశ్వవిద్యాలయం నుండి ఎల్‌ఎల్‌బీ పట్టా కూడా పొందారు. వృత్తిపరంగా, భల్లాకు యాపిల్ ఐఎన్‌సీ సహా సహా పులు కంపెనీలతో అనుబంధం ఉంది. అర్జున్ భల్లా ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో లా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. స్మృతీ ఇరానీ కాబోయే అల్లుడైన అర్జున్ కు 4లక్షల డాలర్ల ఆస్తులున్నాయి. కుమార్తె పెళ్లి కోసం కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ బుధవారం ఉదయం జోధ్‌పూర్ విమానాశ్రయానికి వచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నాగౌర్‌లోని ఖిన్వసార్ కోటకు వెళ్లారు. కొద్దిమంది స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఇరానీ తన కుమార్తె వివాహం పురాతన కోటలో చేయనున్నారు.
తాజావార్తలు
-
Anil Vij: “బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు”.. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
-
Traffic Jam : శ్రీశైలం వద్ద ట్రాఫిక్ నరకం.. 5 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు!
-
US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
-
Harish Rao : పోలవరం-నల్లమల ప్లాన్ వెనుక కుట్ర.. తెలంగాణకు తీరని నష్టం..
-
Anganwadi: గర్భిణీలకు ఇచ్చే ఆహారంలో పాము.. అంగన్వాడీ కేంద్రంలో కలకలం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!