NTV Telugu Site icon

Smriti Irani Daughter: స్మృతి ఇరానీ కూతురి పెళ్లి.. ముస్తాబైన రాజకోట

Smriti Irani

Smriti Irani

Smriti Irani Daughter Marriage: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇంట పెళ్లివేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఆమె ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. స్మృతి ఇరానీ కూతురు షనెల్‌ ఇరానీ గురువారం వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. షనెల్‌ ఇరానీ అర్జున్‌ భల్లాతో కలిసి ఏడడుగులు వేయనున్నారు. వీరిద్దరి వివాహాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మంత్రి స్మృతి ఇరానీ ఏర్పాట్లు ఘనంగానే చేస్తున్నట్లు తెలిసింది. వీరి వివాహ వేడుక రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో గల 15వ శతాబ్ధం నాటి ఖిన్వసార్ రాజకోటలో వైభవంగా జరగనుంది. ఈ పెళ్లి వేడుకల కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఇప్పటికే జోధ్‌పూర్‌ చేరుకున్నారు. పెళ్లి వేడుకల కోసం ఖిన్వసార్ రాజకోట ఇప్పటికే ముస్తాబైంది.

మాజీ మంత్రి ఖిన్వసార్.. స్మృతి ఇరానీ కుమార్తె పెళ్లి వేడుకల పూర్తి బాధ్యతలు తీసుకున్నారని సమాచారం. బుధవారం ఉదయం నుంచే వివాహ ముందస్తు వేడుకలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. పార్సీ, పంజాబీ రెండు ఆచారాల్లో వివాహం జరగనుందని తెలుస్తోంది. షనెల్​ పరిణయానికి పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. కాగా, స్మృతి ఇరానీ కుమార్తె షనెల్ ఇరానీకి అర్జున్​ భల్లాతో 2021 డిసెంబరులో నిశ్చితార్థం జరిగింది. ముంబయిలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో లా కోర్సు పూర్తి చేసిన షనెల్ ఇరానీ​.. ఆ తర్వాత వాషింగ్టన్​ డీసీలోని జార్జ్‌టౌన్‌ వర్సిటీ నుంచి ఎల్​ఎల్​ఎమ్​ పట్టా పొందారు. షనెల్​ ఇరానీకి కాబోయే భర్త అర్జున్​ భల్లా కెనడాలో నివసిస్తున్నారు.

Wedding Bells: పెళ్ళి విషయంలో ‘నేనింతే’ అంటున్న శియా!

అర్జున్ భల్లా కెనడాకు చెందిన న్యాయవాది. అర్జున్ కెనడాలో పుట్టి అక్కడే స్థిరపడినప్పటికీ అతని తల్లిదండ్రులు, తాతలు భారతదేశానికి చెందినవారు. అర్జున్ తండ్రి పేరు సునీల్ భల్లా కాగా తల్లి పేరు షబీనా భల్లా. ఒక నివేదిక ప్రకారం, అర్జున్ భల్లా తన పాఠశాల విద్యను కెనడాలోని అంటారియోలోని సెయింట్ రాబర్ట్ కాథలిక్ ఉన్నత పాఠశాలలో పూర్తి చేశాడు. అతను 2009 నుంచి 2013 మధ్య కెనడాలోని టొరంటోలోని సెయింట్ మైఖేల్ కళాశాలలో సైకాలజీ, ఎథిక్స్, లా అండ్ సొసైటీలో బ్యాచిలర్స్ డిగ్రీని చదివాడు. అనంతరం ఆయన యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లీసెస్టర్ విశ్వవిద్యాలయం నుండి ఎల్‌ఎల్‌బీ పట్టా కూడా పొందారు. వృత్తిపరంగా, భల్లాకు యాపిల్ ఐఎన్‌సీ సహా సహా పులు కంపెనీలతో అనుబంధం ఉంది. అర్జున్ భల్లా ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో లా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. స్మృతీ ఇరానీ కాబోయే అల్లుడైన అర్జున్ కు 4లక్షల డాలర్ల ఆస్తులున్నాయి. కుమార్తె పెళ్లి కోసం కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ బుధవారం ఉదయం జోధ్‌పూర్ విమానాశ్రయానికి వచ్చి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నాగౌర్‌లోని ఖిన్వసార్ కోటకు వెళ్లారు. కొద్దిమంది స్నేహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో ఇరానీ తన కుమార్తె వివాహం పురాతన కోటలో చేయనున్నారు.

Show comments