Machilipatnam Tirupati Express: ఓవైపు ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం, దాని వివరాల్ని తెలుసుకుంటూ బాధపడతూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో.. మరో రైలు ప్రమాదం జరగబోయి.. అంతలో ఆగింది. అది కూడా జరిగివుంటే.. మరో దుర్వార్త అయ్యేది. అసలేం జరిగిందంటే… ఆదివారం అర్ధరాత్రి మచిలీపట్నం-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌కు భారీ ప్రమాదం తప్పింది. మచిలీపట్నం నుంచి తిరుపతి వెళుతుండగా టంగుటూరు వద్ద బోగీల్లోకి పొగలు వ్యాపించాయి. అప్రమత్తమైన ప్రయాణీకులు చైన్ లాగి ట్రైన్‌ను ఆపేశారు.
Read Also: Wrestlers Protest: అమిత్ షాను కలిసిన రెజ్లర్లు.. బ్రిజ్ భూషన్‌పై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి..
బ్రేక్స్ లో ఉండే లూబ్రికెంట్ అయిపోవడం వల్ల చక్రాల రాపిడితో పొగలు వ్యాపించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పొగలు చూసి భయబ్రాంతులకు గురైన ప్రయాణీకులు రైలు దిగిపోయారు. గమనించిన రైల్వే సిబ్బంది హుటాహుటిన పరిస్థితిని కంట్రోల్‌లోకి తెచ్చారు. రైలుకు ఏమీ కాలేదని.. కేవలం లూబ్రికెంట్ అయిపోవడం వల్ల ఇలా పొగలు వచ్చాయని వివరించడంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. 20 నిమిషాల తరువాత తిరిగి రైలు బయలుదేరింది.