Site icon NTV Telugu

Slum Dog Husband : ఓటీటీ లో ట్రెండింగ్ గా నిలిచిన ఫన్ టాస్టిక్ మూవీ..

Whatsapp Image 2023 08 26 At 12.10.07 Pm

Whatsapp Image 2023 08 26 At 12.10.07 Pm

టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ ఇటీవల ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని అప్పి రెడ్డి మరియు వెంకట అన్నప్పరెడ్డి నిర్మించారు. భీమ్స్ సినిరిలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. అయితే ఈ మూవీని ప్రమోట్ చేయడం కోసం మూవీ టీం ఎంతగానో కష్టపడింది. ఈ ప్రమోషన్స్ కారణంగా ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ గురించి కొంతవరకు ప్రేక్షకులలో బజ్ ఏర్పడింది.కానీ భారీ స్థాయిలో హైప్ క్రియేట్ అవ్వలేదు.మూవీకి సంబంధించిన ట్రైలర్లోని కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి..జులై 29 న ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ సినిమా థియేటర్లలో విడుదలయ్యింది. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రణవి మణుకొండ.. ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది.

బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ ఈ చిత్రంలో హీరోగా అద్భుతంగా నటించాడు. ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ ప్రమోషన్స్లో బ్రహ్మాజీ ముఖ్య పాత్రను పోషించాడు. సినీ సెలబ్రిటీలకు స్పెషల్ ప్రీమియర్ షో లను కూడా ఏర్పాటు చేశాడు. తానే స్వయంగా సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్నాడు.అలాగే ఈ సినిమాలో కమెడియన్ గా అలరించాడు బ్రహ్మాజీ. అయినా కూడా ఈ సినిమా విషయంలో అంతగా హైప్ క్రియేట్ అవ్వకపోవడంతో థియేటర్లలో ఈ సినిమాను ప్రేక్షకులు అంతగా పట్టించుకోలేదు. ఈ సినిమా విడుదలయ్యి నెలరోజులు అవ్వకముందే ‘ ఓటీటీ లో కి వచ్చేసింది.స్లమ్ డాగ్ హస్బెండ్’మూవీ ఆగస్ట్ 24న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.ఇక ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ కథ విషయానికొస్తే.. హీరోయిన్ను పెళ్లి చేసుకునే ముందు జాతకం లో లోపం కారణం గా ఒక కుక్కతో హీరో పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత తన జీవితంలో జరిగే మార్పుల చుట్టూ కథ తిరుగుతుంది. ఇలాంటి ఒక డిఫరెంట్ కథతో దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్స్ కు ప్రేక్షకులను రప్పించలేకపోయింది.అయితే ఈ సినిమా ఓటీటీ లో అదరగొడుతుంది. అమెజాన్ ప్రైమ్ లో ట్రెండింగ్ లో వున్న 6 వ సినిమాగా నిలిచింది. అయితే థియేటర్ లో మెప్పించకపోయిన ఈ సినిమా ఓటీటీ లో అదరగొడుతుంది.

https://twitter.com/GskMedia_PR/status/1695311774189502894?s=20

Exit mobile version