Human Skulls in a SuitCase: ఎయిర్‌పోర్టుకు కొరియర్ బాక్సుల్లో వచ్చిన సూట్ కేసులను చెక్ చేస్తుండగా కస్టమ్స్ అధికారులు షాక్ తిన్నారు. ఏ దేశంలోనైనా భద్రత కోసం సాధారణంగా ఎయిర్‌పోర్టులు, మెట్రోస్టేషన్‌లలో చెకింగ్ మెషిన్‌లను ఏర్పాటు చేస్తారు. ఈ తనిఖీలు అయా ప్రదేశాల్లో సాధారణమే. మెక్సికన్ విమానాశ్రయంలోనూ భద్రతా సిబ్బంది ఎక్స్ రే మిషన్ల సాయంతో ప్రయాణికుల లగేజీలను తనిఖీ చేస్తున్నారు.
Read Also: Ashu Reddy: అమ్మడి అందాల ఆరబోతకు హద్దే లేదే
ఈ క్రమంలో యూఎస్ కు పంపాల్సిన కొరియర్ సూట్ కేసులో నాలుగు మానవ పుర్రెలను వారు కనుగొన్నారు. వాటిని చూసి షాకవడం అధికారుల వంతయ్యింది. సంబంధిత డాక్యుమెంట్ల ఆధారంగా మెక్సికోలోని అత్యంత హింసాత్మక రాష్ట్రాల్లో ఒకటైన మిచోవాకాన్ నుంచి దక్షిణ కరోలినాకు ఆ పుర్రెలను కొరియర్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, కొరియర్‌లో పుర్రెలు రావడంపై ఎయిర్‌పోర్టు అధికారులు ఎంక్వయిరీ మొదలుపెట్టారు. ఎవరు పుంపుతున్నారు..? ఎవరికి పంపుతున్నారు..? దేని కోసం పంపుతున్నారు..? అనే కోణంలో దీనిపై దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
Read Also: Drugs Seized : భుజ్ సెక్టారులో భారీగా డ్రగ్స్ పట్టివేత
మెక్సికో నేషనల్ గార్డ్ నుండి అధికారులు సెంట్రల్ మెక్సికోలోని క్వెరెటారో ఇంటర్కాంటినెంటల్ ఎయిర్‌పోర్ట్‌కు పిలిపించారు.ఒక ఎక్స్-రే యంత్రం కార్డ్‌బోర్డ్ పెట్టెలో వింత ఆకృతులను గుర్తించిన తర్వాత.. వారు ప్యాకేజీని తెరిచి చూడగా, ప్లాస్టిక్, అల్యూమినియం ఫాయిల్‌తో చుట్టబడిన నాలుగు మానవ పుర్రెలు కనిపించాయి. ఈ పెట్టె దక్షిణ కరోలినాలోని మన్నింగ్‌లోని దక్షిణ నగరమైన అపాజ్‌టింగాన్ నుండి పంపబడిందని నేషనల్ గార్డ్ చెప్పారు.