Site icon NTV Telugu

Skill Development Scam Case: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో విచారణ ఈ నెల 23కి వాయిదా

Skill Case

Skill Case

ACB Court: విజయవాడలోని ఏసీబీ కోర్టులో మరోసారి స్కిల్ డెవలప్మెంట్ కేసు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టులో విచారణ సందర్భంగా.. అప్రూవల్ గా మారిన నిందితుడు సిరీష్ చంద్రకాంత్ షాను విచారించే క్రమంలో కేసుకు సంబంధించి ఇప్పటికే డాక్యుమెంట్స్ ను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు అడిగారు. ఇక, ఈ కేసులో సీఐడీ కోర్టు సమర్పించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు తరుపున లాయర్లు కోరారు.

Read Also: Salaar: సినిమాకే హైలైట్ గా నిలిచిన యాయా ఫుల్ సాంగ్ వచ్చేసింది

అయితే, సీఐడీ కోర్టులో సమర్పించిన డాక్యుమెంట్స్ కు సంబంధించిన దానిపై పిటిషన్ దాఖలు చేయాలని చంద్రబాబు తరుపున న్యాయవాదులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు సిరీష్ చంద్రకాంత్ షా స్టేట్ మెంట్ రికార్డును ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఇక, నారా చంద్రబాబు నాయుడు తరుపున లాయర్లు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఈ నెల 23వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.

Exit mobile version