Site icon NTV Telugu

Madhya Pradesh: బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 12మంది మృతి

Mp Fire

Mp Fire

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని హర్దా టౌన్‌ (Harda Town) లో ఘోర విషాదం చోటుచేసుకుంది. బాణాసంచా ఫ్యాక్టరీ (firecracker factory)లో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఇప్పటివరకు 12 మంది చనిపోయారు. మరో 60 మందికి పైగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. ఫైరింజన్లు, సహాయక బృందాలు హుటాహుటినా సంఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు. మంటలు చుట్టుపక్కల ఉన్న భవనాలకు కూడా విస్తరించడంతో పలువురు పరుగులు తీయగా, మరికొందరు ఫ్యాక్టరీలో చిక్కుకున్నట్టు అనుమానిస్తున్నారు.

అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ అత్యవసర సమావేశం నిర్వహించారు. పరిస్థితిని సమీక్షించారు. హెలికాప్టర్ ద్వారా పరిస్థితిని అంచనా వేసి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని మంత్రులకు, అధికారులకు ఆదేశించారు. క్షతగాత్రుల తక్షణ చికిత్సకు భోపాల్, ఇండోర్‌లోని మెడికల్ కాలేజీలు, భోపాల్ ఏఐఐఎంఎస్ బర్న్ యూనిట్‌కు తరలించాలని అదేశాలిచ్చారు.

అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచిత చికిత్స అందించనున్నారు. హార్దా జిల్లా ఆస్పత్రిలో 65 మంది చికిత్స పొందుతున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మోడీ దిగ్భాంతి.. సహాయం..
హర్దా అగ్నిప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు సహాయాన్ని ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు.. క్షతగాత్రులకు రూ.50 వేల సహాయం ప్రకటించారు.

Exit mobile version