Site icon NTV Telugu

తెలంగాణ అసెంబ్లీలో ఆరు బిల్లులకు ఆమోదం !

assembly

assembly

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ చాలా రసవత్తరంగా సాగిన విషయం తెలిసిందే. అయితే… ఇవాళ పలు కీలక బిల్లులు తెలంగాణ అసెంబ్లీ లో ఆమోదం పొందాయి. ఇందులో తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు 2021 ను.. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టగా… ది తెలంగాణ స్టేట్ ప్రివెన్షన్ ఆఫ్ టౌటింగ్ అండ్ మాల్ప్రాక్టీస్ అగైనెస్ట్ టూరిస్ట్ అండ్ ట్రావెలర్స్ బిల్ 2021ను హోంమంత్రి మహమూద్ అలీ ప్రవేశట్టారు. ఈ రెండు బిల్లులు మొదట ఆమోదం పొందగా….మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశ పెట్టిన… తెలంగాణ హౌసింగ్ బోర్డు సవరణ బిల్లు 2021 తర్వాత ఆమోదం పొందింది. ఇక కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ సవరణ బిల్లును నిరంజన్ రెడ్డి ప్రవేశపెట్టగా… ది నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రిసెర్చ్ యూనివర్సిటీ సవరణ బిల్లు ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రవేశ పెట్టారు. అనంతరం తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు కూడా ఆమోదం పొందినట్లు సమాచారం అందుతోంది.

Exit mobile version