NTV Telugu Site icon

SK23 : మరో ప్రయోగాత్మక చిత్రం చేయనున్న శివకార్తికేయన్‌.. డైరెక్టర్ ఎవరంటే..?

Whatsapp Image 2024 02 02 At 2.14.12 Pm

Whatsapp Image 2024 02 02 At 2.14.12 Pm

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు, తమిళ ప్రేక్షకులలో మంచి ఫాలోయింగ్ వున్న ఈ స్టార్ హీరో ప్రయోగాత్మక సినిమాలు చేస్తున్నాడు.ఇటీవలే శివకార్తికేయన్ అయలాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం SK21 తో బిజీ గా ఉండగా.. ఆ మూవీ షూటింగ్ దశలో ఉంది. ఆ చిత్రాన్ని రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నాడు. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.మరోవైపు అయలాన్ సినిమాకు సీక్వెల్‌ అయలాన్‌ 2 మూవీని కూడా మేకర్స్‌ ప్రకటించేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు SK23 ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఒకటి తెగ వైరల్ అవుతుంది

ఈ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్‌ ఏఆర్‌ మురుగదాస్ డైరెక్షన్‌లో చేయబోతున్నాడని సమాచారం.యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న క్రైం ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా తో శివకార్తికేయన్ ఖాతాలో మరో ప్రయోగాత్మక సినిమా చేరిపోనున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమా కోసం ఏఆర్‌ మురుగదాస్‌ మరో ముగ్గురు రైటర్ల తో కలిసి పనిచేయనున్నాడని సమాచారం.ఈ సినిమా కు సంబంధించి మరిన్ని వివరాలపై రాబోయే రోజుల్లో మురుగదాస్ టీం క్లారిటీ ఇవ్వనుంది.SK 21 లో శివకార్తికేయన్ నయా లుక్‌లో కనిపించబోతున్నాడని ఇప్పటికే ఓ అప్‌డేట్ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ లో విశ్వరూపం ఫేం రాహుల్ బోస్‌ విలన్‌గా నటిస్తున్నారు.ఇప్పటికే సాయిపల్లవి కశ్మీర్‌ లొకేషన్‌ లో దిగిన ఫొటోలు ఎంతగానో వైరల్ అయ్యాయి.. మేకర్స్ కశ్మీర్‌ లో 75 రోజులపాటు SK21 లాంగ్ షెడ్యూల్‌ పూర్తి చేశారు. సినిమా కోసం గైడ్‌ చేసిన రియల్‌ హీరోలు ఇండియన్ మిలటరీ జవాన్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతుంది.

Show comments