Site icon NTV Telugu

Fiji New Prime Minister: ఫిజీ కొత్త ప్రధానమంత్రిగా సితివేణి రబుకా ఎన్నిక

New Fiji Pm Sitiveni Rabuka

New Fiji Pm Sitiveni Rabuka

Fiji New Prime Minister: ఫిజీ కొత్త ప్రధానమంత్రిగా సితివేణి రబుకా ఎన్నికైనట్లు ఆ దేశ పార్లమెంట్ శనివారం ప్రకటించింది. రబుకా, 2021లో ఏర్పడిన ఫిజీలో రాజకీయ పార్టీ అయిన పీపుల్స్ అలయన్స్ నాయకుడు. 2006 సైనిక తిరుగుబాటులో ప్రభుత్వాన్ని పడగొట్టి, ఒక సంవత్సరం తర్వాత దేశ ప్రధానమంత్రి అయిన ఫ్రాంక్ బైనిమరామ స్థానంలో రబుకా నియమితులయ్యారు. పార్లమెంటులో రబుకా 28 ఓట్లతో ఎన్నికయ్యారు. అయితే ఫిజీ మాజీ ప్రధాని వోరెక్ బైనిమరామకు 27 ​ఓట్లు రాగా.. తృటిలో విజయం సాధించారు.

Bharat Jodo Yatra: దేశ రాజధానిలోకి భారత్ జోడో యాత్ర ఎంట్రీ.. పాల్గొననున్న కమల్‌ హాసన్

ఫిజియన్ పార్లమెంట్‌కు కొత్తగా ఎన్నికైన స్పీకర్ నైఖామా లాలాబలవు ఈ విషయాన్ని ప్రకటించారు. ఫిజీ సోషల్ డెమోక్రటిక్ లిబరల్ పార్టీ శుక్రవారం రబుకా పార్టీ అయిన పీపుల్స్ అలయన్స్, నేషనల్ ఫెడరేషన్ పార్టీతో జతకట్టింది. 2006 సైనిక తిరుగుబాటులో అధికారాన్ని స్వాధీనం చేసుకున్న ఫ్రాంక్ బైనిమరామ నేతృత్వంలోని 16 సంవత్సరాల నాయకత్వానికి ముగింపు పలికి, రబుకా తదుపరి పదవీకాలానికి విజయం సాధించారు. 16 ఏళ్ల తర్వాత తొలిసారిగా కొత్త ప్రధానికి స్వాగతం పలికేందుకు ఫిజియన్లు సిద్ధమవుతున్నారు. ఫిజీలో జరిగిన గత రెండు ప్రజాస్వామ్య ఎన్నికలలో బైనిమరామ ఫిజీ ఫస్ట్ పార్టీ విజయం సాధించింది.

Exit mobile version