Site icon NTV Telugu

AP Liquor Scam: లిక్కర్ కుంభకోణంలో కీలక మలుపు.. రూ.11 కోట్ల నగదు స్వాధీనం

Raj Kesireddy

Raj Kesireddy

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఏ40గా ఉన్న వరుణ్‌ ఇచ్చిన సమాచారంతో ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లో సిట్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్‌కేసిరెడ్డి ఆదేశాలతో వరుణ్‌, చాణక్య 12 పెట్టెలలో రూ.11 కోట్లు దాచినట్టు అంగీకారించారు. 2024 జూన్‌లో ఈ మొత్తం దాచినట్టు అధికారులు పేర్కొన్నారు. శంషాబాద్‌ మండలంలోని కాచారం ఫార్మ్‌ హౌస్‌లో సిట్‌ దాడులు చేసి రూ.11 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ గెస్ట్ హౌస్ సులోచన ఫార్మ్స్, ప్రొఫెసర్ తగల బాల్ రెడ్డి, పేరు మీద ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించారు.
YouTube video player

Exit mobile version