Site icon NTV Telugu

Tirupati Laddu Case: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో కదులుతున్న డొంక.. పలువురు ఉద్యోగులకు నోటీసులు

Laddu

Laddu

తిరుమల లడ్డూ ప్రసాదాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో టీటీడీ ఉద్యోగుల అవినీతిపై దృష్టి సారించింది సిట్‌. ఈ క్రమంలో తిరుమల లడ్డు నెయ్యి కేసులో డొంక కదులుతోంది. సిట్‌ ఇప్పటికీ చార్జ్ షీట్ వేసింది. భోలేబాబా డెయిరీ కేంద్రంగా దర్యాప్తు చేస్తోంది.. తాజాగా టీటీడీలో జరిగిన అంశాలపై దర్యాప్తు ప్రారంభమైంది.

Also Read:Telegram Global Contest: కంటెంట్ క్రియేటర్ల కోసం గ్లోబల్ కాంటెస్ట్ ప్రకటించిన టెలిగ్రామ్.. 42 లక్షలకు పైగా బహుమతులు..!

ఈ నేపథ్యంలో విచారణకు రావాలనీ పలువురు ఉద్యోగులకు నోటీసులు జారీ‌‌ చేసింది సిట్. త్వరలో టీటీడీలో పనిచేస్తున్న మరికొందరు ఉద్యోగులను సిట్ అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం. సిట్ నిర్ణయంతో టీటీడీ అధికారులో ఆందోళన మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి నెయ్యి సరఫరా టెండర్లు దక్కించుకున్న ఏఆర్‌ డెయిరీ నాణ్యత లేని నెయ్యిని సరఫరా చేసిందన్న ఆరోపణలపై తిరుపతి ఈస్ట్‌ పోలీస్‌ స్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైన విషయం తెలిసిందే.

Exit mobile version