Site icon NTV Telugu

AP Violence: డీజీపీని కలిసిన సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్.. అల్లర్లపై నివేదిక అందజేత

New Project (31)

New Project (31)

ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు 13 మంది సభ్యులతో సిట్ బృందాన్ని ప్రభుత్వం నియమించింది. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో సిట్ విచారణ పూర్తి చేసింది. సోమవారం సాయంత్రం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ సారథి వినీత్ బ్రిజ్ లాల్ భేటీ అయ్యారు. 150 పేజీలతో సుదీర్ఘ నివేదికను వినీత్ బ్రిజ్ లాల్ డీజీపీ కి సమర్పించారు. ఎన్నికల రోజు, ఎన్నికల అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా 30కి పైగా హింసాత్మక ఘటనలు జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు గుర్తించినట్లు సమాచారం.

READ MORE: Pawan Wishes NTR: ఎన్టీఆర్ కి పవన్ స్పెషల్ విషెస్.. భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ!

ఇప్పటికే పలు స్టేషన్లలో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యారు. ఘర్షణ తీవ్రతను బట్టి పలు ఠాణాల్లోని నమోదైన కేసులకు సంబంధించి కొన్ని సెక్షన్లు మార్పులు చేయాలని సిట్ నివేదికలో ఉన్నట్లు.. కొత్త ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసే అంశాన్ని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు డీజీపీ ఏర్పాటు చేసిన సిట్‌ దర్యాప్తును పూర్తి చేసి నివేదికను ఇచ్చింది. దీంతో ఈ నివేదికను సీఈసీ, ఎన్నికల సంఘం సీఈవోకు డీజీపీ అందజేయనున్నారు. కాగా.. మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు పర్యటించిన ఈ బృందం.. నిన్న అర్ధరాత్రి వరకు ప్రత్యేక దర్యాప్తు కొనసాగించింది. ఈ దమనకాండపై రెండు రోజులపాటు అల్లర్లు జరిగిన ప్రాంతానికి వెళ్లి విచారణ జరిపింది. ప్రతి అంశాన్ని సిట్ అధికారులు పరిగణలోకి తీసుకున్నారు.

Exit mobile version