Tirumala Adulterated Ghee Case: తిరుమలలో కలకలం సృష్టించిన కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది.. తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక నిందితుడుగా ఉన్న A-16 అజయ్ కుమార్ సుగంధ్‌ను అరెస్టు చేసినట్లు సిట్ అధికారులు తెలిపారు. అజయ్ కుమార్ మోన్ గ్లిసరైడ్స్, అసిటిక్ యాసిడ్ ఎస్టర్ వంటి రసాయనాలను బోలే బాబా కంపెనీకి సరఫరా చేసినట్లు దర్యాప్తులో బయటపడింది. ఈ కెమికల్స్‌ను పామాయిల్ తయారీలో వినియోగించి, అదే పామాయిల్‌ను నెయ్యి పేరుతో తిరుమల లడ్డూల తయారీ కోసం సరఫరా చేసినట్టు.. ఆ నెయ్యినే లడ్డూల తయారీలో ఉపయోగించినట్లు సిట్ గుర్తించింది. దీంతో లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో 90 శాతం వరకు పామాయిల్ ఉన్నట్లు వెల్లడైంది. గత ఏడేళ్లుగా బోలే బాబా కంపెనీకి పామాయిల్ తయారీలో అవసరమైన కెమికల్స్‌ను అజయ్ కుమార్ సరఫరా చేస్తున్నట్లు సిట్ పేర్కొంది. ఇక, అజయ్ కుమార్‌ను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు సిట్ అధికారులు… దీంతో, అజయ్ కుమార్‌కు ఈ నెల 21వ తేదీ వరకు రిమాండ్ విధించింది ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం..
Read Also: Astrology: నవంబర్ 8, శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
