NTV Telugu Site icon

Singham Again : వైరల్ అవుతున్న కరీనా కపూర్ ఫస్ట్ లుక్..

Whatsapp Image 2023 11 09 At 11.59.04 Am

Whatsapp Image 2023 11 09 At 11.59.04 Am

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్‌ శెట్టి తెరకెక్కించిన సినిమాలలో ‘సింగం’సిరీస్‌ కు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సిరీస్‌ లో తెరకెక్కిన రెండు సినిమాలు కమర్షియల్‌ గా భారీ విజయాలు సాధించాయి. ఇక ఇప్పుడు సింగం అగైన్ సినిమా తెరకెక్కబోతుంది. అజయ్‌ దేవగన్ ప్రధాన పాత్ర లో నటిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్ మరియు రణ్‌వీర్ సింగ్ కీ రోల్స్ పోషిస్తున్నారు. ఇక రీసెంట్‌గా సినిమా నుంచి దీపికా తో పాటు, టైగర్ ష్రాఫ్ మరియు రణ్‌వీర్ సింగ్ ఫస్ట్‌ లుక్‌ లను విడుదల చేయగా.. ఫ్యాన్స్‌ ను తెగ ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో క్యారెక్టర్ రివీల్ చేశారు.ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ నటిస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీనికి సంబంధించి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ ను తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్‌ లో గన్ పట్టుకుని ఎవరినో కాలుస్తున్నట్లుగా రా అండ్ రస్టిక్ లుక్‌ లో కరీనా కనిపిస్తుంది. కరీనా కపూర్ ఫ్యాన్స్‌ ను ఎంత గానో ఆకట్టుకుంటుంది.12 సంవత్సరాల కిందట వచ్చిన సింగం సినిమా బాలీవుడ్‌ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది… అజయ్‌ దేవగణ్‌ హీరో గా నటించిన ఈ సినిమా హిందీ బాక్సాఫీస్‌ దగ్గర భారీ కలెక్షన్స్ రాబట్టింది..నిజానికి ఇది తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన యముడు సినిమా కు రీమేక్‌ గా తెరకెక్కింది.. దీనికి కొనసాగింపు గా మూడేళ్ల కు సింగం రిటర్న్స్‌ తెరకెక్కింది. ఆ సినిమా తొలిపార్టుకు మించి కలెక్షన్‌ లు రాబట్టింది..ఇక అప్పటికే గోల్‌మాల్‌ సిరీస్‌ తో రక్షిత్‌శెట్టి-అజయ్‌ దేవగణ్‌ లు సూపర్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకోగా ఇప్పుడు సింగం సిరీస్‌ తో కూడా వీరి కాంబినేషన్ తిరుగులేనిది గా పేరు తెచ్చుకుంది..

Show comments