NTV Telugu Site icon

Simon Harris: ఐర్లాండ్ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి.. చిన్న వయసులో కీలక బాధ్యతలు

Pm

Pm

భారత సంతతికి చెందిన మరో వ్యక్తి ప్రధాని కాబోతున్నాడు. ఇప్పటికే బ్రిటన్ సహా పలు దేశాల్లో భారతీయులు కీలక పదవుల్లో ఉన్నారు. ఇప్పుడు ఐర్లాండ్ దేశానికి భారత సంతతి వ్యక్తి సైమన్ హారిస్ ప్రధానిగా ఎంపికయ్యారు. లియో వరద్కర్ రాజీనామా తర్వాత.. 37 ఏళ్ల యువ నేతకు బాధ్యతలు అప్పగించారు. ఫైన్ గేల్ పార్టీకి కొత్త నాయకుడిగా ఎన్నికైన తర్వాత హారిస్ ఇప్పుడు దేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా అవతరించారు.

37 ఏళ్ల సైమన్ హారిస్, లియో వరద్కర్ స్థానంలో ఆదివారం పార్టీ నాయకుడిగా నియమితులవడం తన జీవితంలో గొప్ప గౌరవమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో తనను ఎన్నుకున్న వారికి హారిస్ కృతజ్ఞతలు తెలియజేశారు. మీ నమ్మకాన్ని తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చారు. నిజానికి లియో వరద్కర్ అనూహ్యంగా బుధవారం రాజీనామా చేశారు. పార్టీ మరొక నాయకుడి ఆధ్వర్యంలో నడుస్తుందని చెప్పారు. ఆ క్రమంలో ఫైన్ గేల్ సంకీర్ణ భాగస్వాముల మద్దతు కారణంగా హారిస్ రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ అతి పిన్న వయస్కుడైన సైమన్ హారిస్ ప్రధానిగా ఎంపికయ్యారు.

ఇక సైమన్ హారిస్ పార్టీ యువజన విభాగం నుంచి పట్టభద్రుడయ్యాడు. చిన్న వయస్సు నుంచి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. పార్టీలో వివిధ పాత్రలు పోషించారు. హారిస్ 2016 నుంచి 2020 మధ్యకాలం వరకు కీలకమైన కాలంలో ఐర్లాండ్ ఆరోగ్య మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఉన్నత విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి ప్రశంసలు దక్కించుకున్నారు.