NTV Telugu Site icon

Mathu Vadalara 2 : రండి బాబూ రండి.. టికెట్ ధర కేవలం 112 రూపాయలే..

Mathu Vadalara 2 Review

Mathu Vadalara 2 Review

Mathu Vadalara 2 : ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లో ప్రేక్షకులను మెప్పించిన సినిమాల్లో మత్తు వదలరా 2 ఒకటి. శ్రీ సింహ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న చిత్రం ‘మత్తు వదలరా 2’ కి మంచి స్పందన దక్కింది. లో బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ మధ్య కాలంలో భారీ వసూళ్లు సొంతం చేసుకున్న చిన్న సినిమాల జాబితాలో ఇది కూడా ఒకటి గా నిలిచింది. శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు రితేష్ రానా దర్శకత్వం వహించగా, కాల భైరవ సంగీతాన్ని అందించారు. మైత్రి మూవీ మేకర్స్ సినిమాను రిలీజ్ చేశారు. సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

Read Also:Eating Biscuits: బిస్కెట్స్ ఎక్కువగా తింటున్నారా? హెచ్చరిక!

విడుదలైన మొదటి వారమే సినిమా బ్రేక్‌ ఈవెన్‌ వసూళ్లను దక్కించుకుంది. రూ.8 కోట్ల బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్‌ టార్గెట్‌ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మత్తు వదలరా 2 సినిమా ఇప్పటి వరకు దాదాపు రూ.14 కోట్ల షేర్ ను రాబట్టినట్లు సమాచారం. సినిమా కలెక్షన్స్ ను మరింత పెంచడం కోసం మైత్రి మూవీ మేకర్స్ వారు నైజాం ఏరియాలో సినిమా టికెట్ల రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ దసరాకు మీ ఫ్యామిలీతో కేవలం రూ.112 లకే సినిమాను చూడండి అంటూ ఆఫర్‌ ను ప్రకటించారు. ఇటీవల టికెట్ల రేట్లు భారీగా పెరగడం కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలకు దూరం అవుతున్నారు. ఒక్క ఫ్యామిలీ సినిమాకు వెళ్లాలంటే రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అందుకే ఈ సినిమా టికెట్లకు దసరా ఆఫర్ ఇచ్చి కేవలం రూ.112 లకే ఇవ్వడానికి సిద్ధం అయ్యారు. నైజాం ఏరియాలో ఇప్పటికే స్కూల్స్ కి హాలిడేస్ ప్రకటించారు. కనుక కలెక్షన్స్ కలిసి వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విడుదల అయిన నాలుగు వారాల తర్వాత ఇలాంటి ఆఫర్ ఎంత వరకు వర్కౌట్ అయ్యేను అనేది కొందరి అనుమానం.

Read Also:Road Accident: దారుణం.. ప్రమాదంలో 10 మంది కార్మికులు మృతి!

Show comments