ప్రజంట్ సమంత కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది.దీంతో మళ్లి అవకాశాలు క్యూ కడుతున్నాయి. అలా అని పిచ్చి పిచ్చి ప్రాజెక్ట్‌లు కాకుండా ఐడియాతో కథలు ఎంచుకుంటుంది సామ్. ఇందులో భాగంగా ఇప్పటికే ‘మా ఇంటి బంగారం’ మూవీతో ఓ పవర్ ఫుల్ ఉమెన్ గా రాబోతుంది. అయితే తాజాగా సమంత లిస్ట్ లోకి మరో కోలివుడ్ మూవీ చేసినట్లు సమాచారం..
Also Read : MSV : చిరు మూవీలో మోహన్ బాబు మేనరిజం.. ఆ క్రెడిట్ బాస్‌దే: అనిల్ రావిపూడి క్లారిటీ!
తమిళ స్టార్ హీరో శింబు.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్‌లో రాబోతున్న తొలి చిత్రం ‘అరసన్’ (Arasan). ఈ చిత్రంపై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది వెట్రిమారన్ కల్ట్ క్లాసిక్ ‘వడ చెన్నై’ (Vada Chennai) సినిమాకు సంబంధించిన ప్రపంచంలో (Universe) సాగే కథ అని ఇప్పటికే చిత్ర యూనిట్ ధృవీకరించింది. మదురైకి చెందిన ఒక కబడ్డీ క్రీడాకారుడు చెన్నైకి వచ్చి డాన్‌గా ఎలా మారాడు అనే ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి నాయిక ఎంపిక ఆసక్తికరంగా మారింది.
ఇందులో భాగంగా మేకర్స్ ఇప్పటికే సమంతతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సమంత కూడా వెట్రిమారన్ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ, తన డేట్స్ కథలోని తన పాత్ర ప్రాధాన్యతను బట్టి నిర్ణయం తీసుకోనుందట. ఒకవేళ సమంత ఓకే చెబితే, శింబు సమంత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. ఈ సినిమాలో మరో విశేషం ఏమిటంటే, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించనున్నారు. దీంతో ఇది పక్కా మల్టీస్టారర్ సినిమాగా మారిపోయింది. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది.
