Site icon NTV Telugu

PSL 2025 Final: పీఎస్ఎల్ ఫైనల్ కోసం 6 వేల కిమీ జర్నీ.. ఫ్లైట్ డబ్బులు వృధా కాలే!

Sikandar Raza Psl 2025 Final

Sikandar Raza Psl 2025 Final

జింబాబ్వే ఆల్‌రౌండర్‌ సికందర్ రజా పీఎస్ఎల్ 2025 ఫైనల్ కోసం 6 వేల కిలీమీటర్లకు పైగా ప్రయాణించాడు. ప్రయాణం మాత్రమే కాదు.. టైటిల్ గెలవాలడంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ పడటానికి కేవలం పది నిమిషాల ముందు లాహోర్ ఖలందర్స్‌ జట్టుతో కలిశాడు. అంతకుముందు ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన ఇంగ్లాండ్-జింబాబ్వే టెస్ట్ మ్యాచ్ మూడో రోజు సికందర్ రాజా 68 బంతుల్లో 60 పరుగులు చేశాడు. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ మూడు రోజుల్లోనే పూర్తి కావడంతో లాహోర్ ఖలందర్స్‌ ఫ్రాంచైజీ ఓనర్ ఫైనల్లో పాల్గొనాల్సిందిగా సికందర్ రజాకు కబురు పంపాడు.

లాహోర్ ఖలందర్స్‌ ఫ్రాంచైజీ ఓనర్ విన్నపం మేరకు వెంటనే బయలుదేరిన సికందర్ రజా 6 వేల కిలీమీటర్లు జర్నీ చేసి టాస్ వేయడానికి కేవలం పది నిమిషాల ముందు పాకిస్తాన్‌లో అడుగుపెట్టాడు. విమానాశ్రయం నుండి నేరుగా మైదానానికి వెళ్లిన రజా 43 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. అనంతరం 7 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 22 రన్స్ చేసి.. లాహోర్ ఖలందర్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లాహోర్ 13వ ఓవర్లో 115 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో అబ్దుల్లా షఫీక్ 28 బంతుల్లో 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నాలుగు ఓవర్లలో 30 పరుగులు మాత్రమే వచ్చాయి.

Also Read: RK Roja: మహానాడులో తీర్మానం చేసే దమ్ము టీడీపీకి నేతలకు ఉందా?.. ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు!

లాహోర్ 3.2 ఓవర్లలో 57 పరుగులు చేయాల్సి వచ్చినప్పుడు సికిందర్ రజా 6వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చివరి ఓవర్లో ఒక వైడ్, రెండు సింగిల్స్, ఒక డబుల్ తర్వాత లాహోర్ విజయానికి మూడు బంతుల్లో 8 పరుగులు అవసరం అయ్యాయి. ఫహీమ్ వేసిన బంతికి సికిందర్ రజా ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్నందించాడు. దాంతో రజా మ్యాచ్ హీరో అయ్యాడు. లాహోర్ ఖలందర్స్ ఓనర్ ఫ్లైట్ కోసం పెట్టిన డబ్బులకు న్యాయం చేశాడు. ‘ఫ్లైట్ డబ్బులు వృధా కాలే’ అంటూ ఫాన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Exit mobile version