Site icon NTV Telugu

Sigachi Blast: సిగాచి పరిశ్రమ సీఈవో అమిత్ రాజ్ సిన్హా అరెస్ట్..

Ceo Amit Raj Sinha

Ceo Amit Raj Sinha

ఈ ఏడాది జూన్ 30న సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. మైక్రోక్రిస్టలైన్ సెల్యులోజ్ యూనిట్ తయారీలో స్ప్రే డ్రయర్ పేలడంతో దుర్ఘటన జరిగింది. సిగాచీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు పోలీసులు. డ్రయర్ శుభ్రం చేయకపోవడం, అధిక ఒత్తిడి కారణంగా స్ప్రే డ్రయర్ పేలినట్టు ప్రాథమికంగా నిర్దారించారు నిపుణులు. సంగారెడ్డి జిల్లాలోని పాశమైలారంలోని సిగాచి కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదం కేసులో సిగాచి కంపెనీ సీఈఓ అమిత్ రాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు.

Also Read:LIC New Jeevan Shanti Plan: ఎల్ఐసీ బెస్ట్ ప్లాన్.. ఒకసారి పెట్టుబడి పెడితే చాలు.. జీవితాంతం రూ.లక్ష పెన్షన్ పొందే ఛాన్స్!

అమిత్ రాజ్ సిన్హాని నిన్న రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పటాన్ చెరు పోలీసులు. అమిత్ రాజ్ సిన్హాని సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలుకు తరలించారు. పేలుడు ధాటికి 54 మంది మృతి, అందులో 8 మంది ఆచూకీ గల్లంతు, పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన 6 నెలలకు సిగాచి యాజమాన్యంపై చర్యలు తీసుకున్నారు పోలీసులు. సిగాచి పరిశ్రమలో పేలుడు కేసులో అమిత్ రాజ్ సిన్హా A2గా ఉన్నారు.

Exit mobile version