Site icon NTV Telugu

Jack Teaser : యాక్షన్ కు యాక్షన్.. కామెడీకి కామెడీ.. టీజర్ తోనే అదరగొట్టిన స్టార్ బాయ్ సిద్ధు

Jack Update

Jack Update

Jack Teaser : డీజే టిల్లు ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బ‌స్టర్ త‌ర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగ‌డ్డ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘జాక్ కొంచెం క్రాక్‌’ అనే ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోంది. సరికొత్త జోన‌ర్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా టీజర్‌ను సిద్ధు జొన్నలగ‌డ్డ పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 7న విడుదల చేశారు. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగ‌డ్డ తన తదుపరి చిత్రంతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ‘డీజే టిల్లు’ బ్లాక్‌బ‌స్టర్ విజయాన్ని అందుకున్న సిద్ధు జొన్నలగ‌డ్డ, ఇప్పుడు ‘జాక్ కొంచెం క్రాక్‌’తో ఓ కొత్త ప్రయాణం ప్రారంభించనున్నారు. ఈ చిత్రం ఇటీవల విడుదలైన టీజర్‌తో అదిరిపోయే హింట్ ఇచ్చింది. ఇది ప్రేక్షకుల మధ్య అంచనాలు మరింత పెంచింది.

Read Also:Relationships: తియ్యగా ఉన్నాయని ఇలాంటి వాళ్ల మాటలు వింటున్నారా? మొదటికే మోసం

‘బేబి’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తున్నారు. టీజర్‌లో సిద్ధు జొన్నలగ‌డ్డ అద్భుతమైన వినోదంతో తన పాత్రతో తన మార్క్ కామెడీ పండించాడు. టీజర్‌లో ఆయన పర్‌ఫార్మెన్స్ చూడగానే అర్థమవుతుంది. భాస్కర్ ద‌ర్శ‌క‌త్వంలో అద్భుతమైన స్క్రీన్‌ప్లే, గ్యాగ్‌లు, కామెడీ సీన్లు ఈ టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘జాక్ కొంచెం క్రాక్‌’ చిత్రం ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రొమాంటిక్ ఎలిమెంట్లను కలగలిపి రూపొందించబడినట్లు తెలుస్తోంది. సినిమా మరింత రెగ్యులర్ ప్రేక్షకులకు చేరడానికి, కుటుంబ సమేత ప్రేక్షకులను ఆకర్షించడానికి రెడీ అవుతుంది. శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Read Also:TGPSC : గ్రూప్స్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఈ నెలలోనే..

Exit mobile version