Site icon NTV Telugu

Tillu Square Collections : టిల్లు గాడి జోరు తగ్గట్లేదు.. ఊచకోతే.. ఎన్ని కోట్లంటే?

Til

Til

యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ అయ్యింది.. అంతేకాదు ఆ సినిమా ఓవర్ నైట్ స్టార్ హీరోను చేసింది.. ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు సిద్దు.. సినిమా వచ్చి చాలాకాలం అయిన కూడా ఆ సినిమాలోని పాటలు ఇంకా వినిపిస్తున్నాయి.. ఇక తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ గా తెరకేక్కిన ‘టిల్లు స్క్వేర్’ సినిమా ఇటీవలే విడుదలైంది.. ఇక సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడం మాత్రమే.. బాక్సాఫీస్ వద్ద ఊచకొత మొదలుపెట్టింది. ఏడు రోజులకు సినిమా ఎంత వసూల్ చేసిందో ఒకసారి చూద్దాం..

ఈ సినిమాలో యంగ్ హీరో జొన్నలగడ్డ సిద్దు, అనుపమ పరమేశ్వరన్ హీరో,హీరోయిన్గా నటించారు.. ఈ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళిధర్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ సంగీతాన్ని అందించారు.. సినిమా కథ, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో కలెక్షన్స్ భారీగా పెరుగుతున్నాయి.. వంద కోట్ల క్లబ్ లోకి సినిమా చేరింది..

ఇక ఏడు రోజుల్లో టిల్లు స్క్వేర్ మూవీ భారీగా వసూల్ చేసింది.. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ.94 కోట్లు గ్రాస్ వచ్చింది.. ఈ వీకెండ్ ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. ఈ మూవీ యూఎస్, ఇతర దేశాల్లో కలిపి మొత్తంగా 28 కోట్ల రూపాయలు వసూళ్లను సాధించింది.. అంతేకాదు ఈ దూకుడు కొనసాగితే త్వరలోనే150 కోట్లను వసూల్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు..

Exit mobile version