NTV Telugu Site icon

Siddu Jonnalagadda: దర్శకుడిని మార్చేసిన స్టార్ బాయ్ సిద్ధు

New Project 2024 10 11t075238.124

New Project 2024 10 11t075238.124

Siddu Jonnalagadda: ప్రస్తుతం హిస్టారికల్, మైథాలజీ సినిమాలకు ప్రేక్షకుల్లో బాగా ఆదరణ లభిస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో సక్సెస్ కొట్టాలంటే భాషలకు అతీతంగా ఆ జానర్ సినిమాలు తీయడమే బెటర్ అనుకుంటున్నారు మేకర్స్. డీజే టిల్లుతో సూపర్ సక్సెస్ ఫాంలో ఉన్న స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ సైతం ఇప్పుడు ఓ మైథాలజీ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా రూపొందనున్న భారీ మైథాలజీ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే… ఆ వార్తల్లో నిజం లేదు. సిద్దు కొత్త సినిమాకు దర్శకుడు వెంకీ అట్లూరి కాదు. ‘క్షణం’ వంటి థ్రిల్లర్ తీసి హిట్ అందుకున్న రవికాంత్ పేరేపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Read Also:Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

సిద్దు జొన్నలగడ్డ కథానాయకుడిగా రవికాంత్ పేరు దర్శకత్వం వహించనున్న చిత్రాన్ని శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ తర్వాత అదే నిర్మాతలతో సిద్ధూ జొన్నలగడ్డ హ్యాట్రిక్ చిత్రమిది. దసరా కానుకగా ఇవాళ లేదంటే రేపు ఈ సినిమాను ప్రకటించడానికి రెడీ అవుతున్నారు.

Read Also:IPL 2025-Rohit Sharma: రోహిత్ వేలంలోకి వస్తే.. ఆక్షన్ ఆసక్తికరమే!

ఇప్పటి వరకు సిద్ధూ జొన్నలగడ్డ చేసిన సినిమాలు ఒక ఎత్తు… ఈ సినిమా మరో ఎత్తు అన్నట్లు ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. సిద్ధు కెరీర్లో ఇప్పటి వరకు టచ్ చేయని జానర్, అటెంప్ట్ చేయని క్యారెక్టర్ చేస్తున్నారు. మైథాలజీ నేపథ్యంలో రూపొందే ఈ సినిమాలో మహారాజు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం అందుతోంది. ‘టిల్లు స్క్వేర్’ మూవీ సక్సెస్ తర్వాత ‘మిస్టర్ బచ్చన్’ సినిమాలో అతిథి పాత్రలో సిద్ధూ జొన్నలగడ్డ కనిపించారు. అంతేకాకుండా ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్న ‘తెలుసు కదా’ సినిమాతో పాటు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ‘జాక్’ అనే సినిమా కూడా చేస్తున్నారు. వీటి తర్వాత ‘టిల్లు క్యూబ్’ చేసే ఆలోచనలో ఉన్నారు. ‘తెలుసు కదా’లో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా చేస్తున్నారు.