Site icon NTV Telugu

Siddharth: RCB విన్నింగ్ సెలబ్రేషన్స్.. మహిళల విజయంలో ఒక్క మహిళ కూడా లేదు

Siddharth Crying At Chinna Pressmeet

Siddharth Crying At Chinna Pressmeet

Siddharth: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది.. ఈ పాట ప్రతి RCB పాడుకుంటున్నారు. మరి.. ఒకటా.. ? రెండా.. ? దాదాపు 17 ఏళ్ల నుంచి ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు RCB కప్పు కొట్టింది. అది పురుషుల జట్టా.. మహిళల జట్టా.. అనేది పక్కన పెడితే బెంగుళూరుకు కప్పు వచ్చింది. అదే మాత్రమే ఇక్కడ ముఖ్యం. దీంతో బెంగుళూరు మొత్తం సెలబ్రేషన్స్ లో మునిగిపోయింది. తొలిసారి డబ్ల్యూపీఎల్ RCB గెలిచిన తర్వాత బెంగళూరులో అభిమానులు వీధుల్లోకి వచ్చిన పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ సెలబ్రేషన్స్ పై హీరో సిద్దార్థ్ ఫైర్ అయ్యాడు. అసలు సిద్దూ గురించి, ఆయన రేపిన వివాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరు ఏమనుకుంటారు.. అనేది ఆలోచించకుండా తనకు అనిపించిన అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా ట్వీట్స్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా RCB విన్నింగ్ సెలబ్రేషన్స్ పై తన గొంతు విప్పాడు. అందుకు కారణం కూడా లేకపోలేదు అని చెప్పొచ్చు.

ఎప్పుడు ఏ సెలబ్రేషన్స్ చూసినా అందులో మహిళలు మాత్రం కనిపించరు. ఇప్పుడు సిద్దార్థ్ అదే పాయింట్ ను రైజ్ చేశాడు. మహిళల విజయంలో ఒక్క మహిళా కూడా లేదు అంటూ ట్వీట్ చేశాడు. ” మహిళల బృందం టోర్నమెంట్‌ను గెలుచుకుంది, కానీ ఒక్క మహిళ కూడా వీధిలో వేడుకలు జరుపుకోలేదు. భారతదేశంలో పితృస్వామ్యానికి నిదర్శనం ఈ క్షణం” అంటూ చెప్పుకొచ్చాడు. అంటే.. పురుషులు.. మహిళలను బయటికి పంపడంలేదు అని డైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. కొంతమంది సిద్దార్థ్ ను తప్పు పడుతుంటే.. ఇంకొంతమంది సిద్దార్థ్ చెప్పిన దాంట్లో తప్పేం ఉంది అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

Exit mobile version