NTV Telugu Site icon

Siddharth-Aditi: పొద్దునే అదితి నా నుంచి దాన్ని లాగేసుకుంటుంది: సిద్ధార్థ్‌

Siddharth Aditi

Siddharth Aditi

Siddharth About Aditi Rao Hydari: హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్ అదితిరావు హైదరీలు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని 400 ఏళ్ల నాటి పురాతణ ఆలయం రంగనాథస్వామి గుడిలో వీరి పెళ్లి జరిగింది. కొత్త జంట వివాహానికి ముందు ఆంగ్ల పత్రిక వోగ్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్‌, అదితిలు తమ పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించిన కొన్ని విషయాలు పంచుకున్నారు. పొద్దునే అదితి తన నుంచి నిద్రను లాగేసుకుంటుందని సిద్ధార్థ్‌ చెప్పారు.

‘నేను సూర్యోదయానికి ముందు నిద్రలేవను. నాకు అది చాలా కష్టంగా అనిపిస్తుంది. అదితి మాత్రం పొద్దునే నిద్రలేస్తుంది. తను లేవడమే కాదు నేను లేచే దాకా ఊరుకోదు. ఈ విషయంలో నాకు చాలా చిరాకుగా ఉంటుంది. చిన్న పిల్లాడి దగ్గర నుంచి మిఠాయిలు లాగేసుకున్నట్లు అదితి నా నుంచి నిద్రను లాగేసుకుంటుంది. సూర్యోదయ సమయంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలని అదితి రోజూ అంటుంది’ అని సిద్ధార్థ్‌ అన్నారు.

Also Read: Chiranjeevi-Suhasini: గన్‌తో వాళ్లను బెదిరించారు.. రియల్‌ లైఫ్‌లో కూడా చిరంజీవి హీరోనే: సుహాసిని

‘సిద్ధార్థ్‌ క్యాజువల్‌ డ్రెస్‌లో ఉంటే నాకు ఇష్టం. ఫ్యాషన్‌ దుస్తుల్లో అయితే చాలా స్టైలిష్‌గా ఉంటాడు. మా ఇద్దరికీ గొడవ జరిగితే నేనే ముందుగా సారీ చెబుతా’ అని అదితి తెలిపారు. ‘నేను అదితితో మాట్లాడే 100 మాటలో 90 తప్పులు చేస్తాను. మిగతా 10 మాటలు తనకు థాంక్స్‌ చెప్పేవే ఉంటాయి’ అని సిద్ధార్థ్‌ పేర్కొన్నారు. ‘మహా సముద్రం’ సినిమాలో సిద్ధార్థ్‌, అదితిలు కలిసి నటించారు. సినిమా షూటింగ్‌లో ఏర్పడిన స్నేహం.. ప్రేమగా మారింది. తాజాగా పెళ్లి బంధంతో ఇద్దరు ఒక్కటయ్యారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి.

Show comments